నచ్చిన కోర్సు చదవండి…ఫీజుల గురించి ఆలోచించకండి…నేనున్నా…అంతా నేను చూసుకుంటా…! ఇదీ ఆంధ్రప్రదశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కొత్తలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. ముఖ్యమంత్రి, మంత్రి స్థానాల్లో ఉన్న వారు ‘అండగా ఉంటాం…ఆదుకుంటాం’ తరహా వ్యాఖ్యలు తరుచూ చేసేవే..మనం వినేవే అయినా..కానీ,ఎందుకో జగన్ కాస్త భిన్నంగా కనిపించాడు. అయినా జరిగినప్పడు చూద్దాంలే అనుకుంటుండగానే తానిచ్చిన హామీని నిలబెట్టేసుకున్నాడు. దీంతో తాను ముఖ్యమంత్రి కంటే ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడనని చెప్పకనే చెప్పేశాడు…!
విద్యే పరిష్కారం..
వ్యక్తిలో అజ్ఞానమనే గాఢాంధకారాన్ని ప్రారదోలేది విద్య. సమాజాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, మూఢనమ్మకాలు వంటి రుగ్మతలను విద్యతోనే…విద్యతో మాత్రమే ప్రారదోలగలం…! దీన్ని గుర్తించిన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విద్యకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఐఐటీలతోపాటు మరెన్నో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకు శ్రీకారం చుట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన విద్యకు స్వర్ణయుగంగా విరాజిల్లిందని చెప్పవచ్చు.
బయపెట్టిన బాబు పాలన …
తొలి దఫా చంద్రబాబు పాలన(2004 ముందు) కర్షక, కార్మిక, ఉద్యోగులకే కాదు…విద్యార్థులకూ గడ్డుకాలమే..! ఆ కాలంలో డొనేషన్ల పేరుతో విద్యను అమ్ముతుండేవారు..! ఇంజనీరింగ్ మాట దేవుడెరుగు…బీఈడీలో చేరదామన్నా లక్షలు కట్టాల్సి వచ్చేది. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం వంటి సంప్రదాయ కోర్సులు చదవాలంటేనే బయపడే పరిస్థితి. ఇక ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సుల వైపు కన్నెత్తి చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే…! అలాంటి సమయంలో 2004 ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.
ఇంటికో ఇంజనీర్…
విద్య విలువ తెలిసిన, విద్యాధికుడైన వైఎస్సార్ వ్యవసాయ(ఉచిత విద్యుత్), వైద్య రంగం(ఆరోగ్య శ్రీ)తోపాటు విద్యా రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి తొలిసారి పేదల పిల్లలను ఇంజనీరింగ్, ఎంబీఏ కాలేజీల గుమ్మం తొక్కించారు. ఇంటికో ఇంజనీర్ పుట్టుకొచ్చాడా అనే తరహాలో అప్రహాతీతంగా సాగింది ఆయన పాలన…! కానీ, దురద్రుష్టవశాత్తు ఆయన మరణానంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వాలు తూట్లు పొడవడం ప్రారంభించాయి.
మళ్లీ ఉదయించాడు…!
2014లో తానే సమర్థడుని, తన వల్లే భవిష్యత్ అనే ప్రచారం, పవన్ కళ్యాణ్, బీజేపీలతో చెలిమి కారణంగా చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. నేను మారాను ఒక్కసారి నమ్మండి అంటున్నాడు కదా…ఈసారి విద్యకు సరిపడా నిధులు వెచ్చిస్తారని విద్యార్థులంతా ఆశించారు. కానీ, వారి ఆశలు అడియాశలే అయ్యాయి. అరకొరగా నిధుల విడుదల చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫీజుల కోసం రోడ్కెకారు. అయినా చంద్రబాబు కనికరించింది లేదు. కానీ, విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సూర్యుడు మళ్లీ ఉదయించాడు…కాకపోతే ఈసారి వైఎస్‌ఆర్ కొడుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో…!
ఫీజు మొత్తం చెల్లిస్తాం…
చంద్రబాబు హయాంలో(2018–19) పేరుకుపోయిన రూ.1800 కోట్ల బకాయిలతోపాటు ఈ విద్యా సంవత్సరం మూడు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను జగన్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అంతేకాకుండా మొత్తం ఫీజు ప్రభుత్వమే కడుతుంది కాబట్టి…ఇప్పటికే విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించాలని కాలేజీలను ఆదేశించింది. ఈ మేరకు 191 కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా రాబోయే విద్యా సంవత్సరం(2020–21) నుంచి కాలేజీలు నిర్ణయించిన ఫీజులను తల్లుల ఖాతాల్లోకే జమచేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఏపీలో విద్యాస్వర్ణయుగం మళ్లీ ప్రారంభమైందా అంటూ పలువరు విద్యావేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు…!