iDreamPost
android-app
ios-app

సీయం జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి కుటుంబం

  • Published Feb 19, 2020 | 9:15 AM Updated Updated Feb 19, 2020 | 9:15 AM
సీయం జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి కుటుంబం

డాక్టర్ వై.యస్.ఆర్ కంటివెలుగు పధకం మూడవ దశని ప్రారంభించటానికి కర్నూల్ వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ని సభ అనంతరం సుగాలి ప్రీతి తల్లి కలిసారు. తమ కూతురి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చేసి తమకు న్యాయం చెయాలని కోరగా, ముఖ్యమంత్రి జగన్ ప్రీతి కేసుని రాష్ట్ర ప్రభుత్వం సి.బి.ఐ కి రిఫర్ చెయనుందని, తమ ప్రభుత్వ హాయంలో తప్పక న్యాయం జరుగుతుందని ప్రీతి తల్లితండ్రులకు హామీ ఇచ్చారు, అలాగే ఆమె కుటుంభాన్ని కూడా ఆదుకుంటామని, ప్రీతి విషయమై పూర్తి వివరాలు వారి తల్లి తండ్రులనుండి తెలుసుకునేందుకు ప్రీతి కుటుంభాన్ని తమ వద్దకు మరో సారి పరసనల్ గా తీసుకురావాలని తన కార్యలయ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఎవరు ఈ సుగాలి ప్రీతి?

కర్నూలు లక్ష్మీ గార్డెన్ లో నివాసం ఉంటున్న సుగాలి రాజు నాయక్, పద్మావతిల కుమార్తె 14ఏళ్ళ సుగాలి ప్రీతి. తెలుగుదేశం నేత అయిన వి.జనార్ధన రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో 10వ తరగతి చదివేది. 2017 ఆగస్టు 19 న ఫ్యాన్ కి ఉరి వేసుకుని కనిపించింది. స్కూల్ యాజమాన్యం సుగాలి ప్రీతి ది ఆత్మహత్య అంటున్నప్పటికీ, సుగాలి ప్రీతి తల్లితండ్రులు మాత్రం తమ కుమార్తె ను స్కూల్ అధినేత కొడుకులు (హర్ష వర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి) లు అత్యాచారం చేసి చంపారని ఆరోపిస్తున్నారు.

కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పొస్టూమార్టం చేసిన డాక్టర్ శంకర్ ఆగస్టు 20న ఇచ్చిన ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్టులో బాలికపై అత్యచారం జరిగిందని చెప్పారు. పాథాలజి హెచ్.ఒ.డి డాక్టర్ బాలేశ్వరి కూడా ఆగస్టు 21న ఇచ్చిన రిపోర్టులో అత్యాచారం జరిగిందనే చెప్పారు. దీంతో ప్రీతి తల్లితండ్రులు కాలేజీ యాజమాన్యంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నిందితులపై పోలీసులు పోక్సో సెక్షన్ 302, 201, యస్.సి, యస్.టి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై విచారణకు కలక్టర్ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు. ఈ కమిటీ కూడా విద్యార్ధినిపై లైంగిక దాడి చేసి హత్య చేశారని రిపోర్టు ఇచ్చింది. సాక్ష్యాలు ఇలా పక్కాగా ఉన్నా అరెస్టు అయిన నిందితులకి 23 రోజులకే బెయిల్ వచ్చింది.

నిందితులకి తెలుగుదేశం నేత నంద్యాల లోక్ సభ అభ్యర్థి మాండ్ర శివానంద రెడ్డి అండగా నిలబడి కేసుని నీరుకార్చే ప్రయత్నం అడుగడుగునా చేశారని, మాండ్ర శివానంద రెడ్డి నిందితులని తన ఇంట్లో పెట్టుకుని కాపాడారనే ఆరోపణలు ఉన్నాయి. కేసుని నీరు కార్చేందుకు తెలుగుదేశం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో సుగాలి ప్రీతి తల్లి దండ్రులు జాతీయ మానవహక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. వారి విజ్ఞప్తి మేరకు కమీషన్ అభ్యర్ధన మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేసును సి.ఐ.డి కి అప్పగించింది. అయినా దర్యాప్తులో జాప్యం జరుగుతూ వచ్చింది. రాజకీయ నేతల ఒత్తిళ్ళతోనే కేసులో ఇంత జాప్యం జరుగుతుందని కావున కేసుని సి.బి.ఐ కి అప్పగించాలని చంద్రబాబు హాయాంలోనే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు.

అయితే తాజాగా జగన్ ప్రభుత్వం ఈ కేసుని వారి తల్లి తండ్రులు కోరినట్టే సి.బి.ఐ కు ఇచ్చేందుకు రంగం సిద్దం చేసింది. ఏది ఏమైనా రెండేళ్ల క్రితం జరిగిన గిరిజన బాలిక హత్యను సైతం కోన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు వాడుకోవటం హర్షించదగ్గ పరిణామం కాదు. సుగాలి ప్రీతి హత్యోదంతంలో అసలైన దోషుల ఎవరో తేల్చి చట్టపరంగా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఆ దిశగా సత్వరం చర్యలు తీసుకుని రాజకీయ విమర్శకులకు గట్టి సమాదానం ఇవ్వాలి.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet