iDreamPost
android-app
ios-app

పరిపాలనా రాజధాని విశాఖే అని మరో సారి స్పష్టం చేసిన సీఎం జగన్

  • Published Oct 16, 2020 | 1:49 PM Updated Updated Oct 16, 2020 | 1:49 PM
పరిపాలనా రాజధాని విశాఖే అని మరో సారి స్పష్టం చేసిన సీఎం జగన్

గత ఏడాది పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రానికి మూడు రాజధానులు రాబోతునట్టు అసెంబ్లీలో సీఏం జగన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే . అమరావతి ప్రాంతాన్ని శాసన రాజధానిగా , విశాఖను పరిపాలన రాజధానిగా కర్నూల్ ను న్యాయ రాజధానిగా జగన్ ప్రకటించగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. రాజధాని ఒకే చోట ఉండాలని అదీ అమరావతి ప్రాంతంలో మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతుల పేరిట అమరావతి ప్రాంతానికి చెందిన రెండు మూడు గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

అసంబ్లీలో జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన పరిపాలన వికేంద్రికరణ బిల్లు పాస్ అయినా మండలిలో అడుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిoచి చివరికి బిల్లు గవర్నర్ ఆమోదం పొందడంతో కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. తెలుగుదేశం నేతలు మరీ ముఖ్యంగా చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల అభివృద్దిని అడ్డుకుంటూ మొత్తం అమరావతి కేంద్రంగానే రాజధాని నిర్మాణం జరగాలి అని డిమాండ్ చేయడానికి ఆ ప్రాంతంలో చంద్రబాబు రాజధాని ప్రకటించే ముందే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారని , ఆ మొత్తం భూమి విస్తరణ 4వేల ఎకరాలని ఆ భూములు కాపాడుకునేందుకే తెలుగుదేశం నేతలు , చంద్రబాబు పరిపాలన వికేంద్రికరణను అడ్డుకుంటున్నారని దానికి సంభందించిన సాక్షాలు సైతం చూపిస్తు ప్రభుత్వం తన వాదన వినిపిస్తుంది.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన పరిపాలనా వికేంద్రీకరణ అంశానికి ఇన్ని ప్రతిబందకాలు ఎదురవుతున్న వేళ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లబోతోందో అనే అంశం పైన ఉత్కంఠ నెలకొని ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ తాజాగా పరిపాలనా రాజధాని విశాఖే అని మరో సారి స్పష్టం చేశారు. ఈ మేరకు నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో సాగిన వర్చువల్‌ సమావేశంలో కీలక వాఖ్యలు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటీవ్ క్యాపిటలుగా తమ ప్రభుత్వం చేయబోతోందని, విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రత్యామ్నాయ రోడ్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని గడ్కరీని కోరారు. బీచ్ రోడ్డు నుంచి భోగాపురం వరకు కోస్టల్ హైవేగా టేకప్ చేయగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాల కనెక్టివిటీ.. ఐదు పోర్టులకు అనుసంధానం కోసం నిధులు కేటాయించమని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి జగన్ తాజాగా చేసిన ఈ వాఖ్యలతో విశాఖ ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన జగన్ తప్పకుండా విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరతారనే నమ్మకం తమకుందని విశాఖ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన నేడు సీఏం జగన్ ఏకంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సాగిన సమావేశంలో మరో సారి పరిపాలన రాజధాని ప్రస్థావన తెచ్చి ప్రతిపక్షాలకు గట్టి కౌంటరే ఇచ్చారనే అభిప్రాయం వినిపిస్తుంది.