iDreamPost
android-app
ios-app

2020 – సంక్షోభ ఏడాదిలోను సంక్షేమ వెల్లువ

  • Published Dec 31, 2020 | 3:00 PM Updated Updated Dec 31, 2020 | 3:00 PM
2020 – సంక్షోభ ఏడాదిలోను సంక్షేమ వెల్లువ

జగన్ ప్రభుత్వం మానిఫెస్టోని భగవత్గీత, బైబుల్, ఖురాన్ గా భావిస్తాం అని చెప్పినట్టుగానే కరోనా లాంటి మహమ్మారితో ప్రపంచమే ఆర్ధికంగా కుదేలైన వేలకూడా ముఖ్యమంత్రిగా జగన్ తాను చెప్పిన సంక్షేమ బాటని వీడలేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయడానికి సాహసించనన్ని సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు ఈ సంక్షోభ ఏడాదిలోనూ అందించారు. అంతే కాకుండా తాను ఏమి చెప్పామో , ఏమి చేశామో ప్రజలే న్యాయ నిర్ణేతలు అని చెబుతూ పాలన వివరాలతో కూడిన 78,54,563 బుక్ లెట్ లను వాలంటీర్ల ద్వారా ఇంటి ఇంటికి పంపి ప్రజలే మార్కులు వేయాల్సిందిగా కోరారు.

ఒక పక్క కరోనా మహమ్మారితో లాక్ డౌన్ , అలాగే అదే మార్చ్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ఒక్క నెల మినహా జగన్ ప్రభుత్వం ఈఏడాదిలో ప్రజలను ప్రతినెల సంక్షేమంతో ముంచెత్తిందనే చెప్పాలి. అన్ని వర్గాలకు ఫలాలు అందేలా బడుగు బలహీన వర్గాలు ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా ఎన్నో పధకాలు అమలు చేశారు. కరోనా మహమ్మారి పేరు చెప్పి ప్రజలకు అందాల్సిన పధకాలకు కోత పెట్టే అవకాశం ఉన్నా ప్రజల సంక్షేమమే తన ధ్యేయం అంటూ జగన్ ముందుకే వెళ్ళారు.

ఈ ఏడాదిగా సీఎం జగన్ అందించిన ఫలాలు తేదీల వారిగా చూస్తే

జనవరి 2 – ఆర్టీసీ ఉద్యోగుల వీలీనం
జనవరి 3 – ఆరోగ్యశ్రీ పధకంలో విప్లవాత్మక మార్పులు
జనవరి 9 – అమ్మఒడి
జనవరి 15 – 3వేల కోట్లతో ధరల స్థీరీకరణ ఏర్పాటు
జనవరి 26 – గ్రామ వార్డు సచివాలయాల ద్వార 541 సేవలు అందుబాటులోకి (గడప ముంగిటే పాలన)
___________

ఫిబ్రవరి 1 – ఇంటి వద్దకే పించన్ పంపకం ప్రారంభం
ఫిబ్రవరి 8 – మహిళా రక్షణకై రాజమహేంద్రవరం లో తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
ఫిబ్రవరి 18 – కంటివెలుగు 3వ దశ ప్రారంభం
ఫిబ్రవరి 24 – జగనన్న వసతి దీవెన పధకం ప్రారంభం
___________

మార్చ్ నెల – స్థానిక సంస్థల నోటిఫికేషన్ – కరోనా లాక్ డౌన్ మూలాన సంక్షేమానికి తాత్కాలిక బ్రేక్

____________

ఏప్రిల్ 24 – వైయస్సార్ సున్నా వడ్డి పధకం
ఏప్రిల్ 28 – జగన్ అన్న విద్యా దీవెన (ఫీస్ రీయంబర్స్ మెంట్)
_______________

మే 6 – వైయస్సార్ మత్స్యకార భరోసా
మే 10 – మద్య నియంత్రణ దిశగా చర్యలు – 33% మధ్యం షాపుల రద్దు
మే 15 – 2వ సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా రైతు ఖాతాల్లో జమ
మే 22 – చిన్న పరిశ్రమలకు MSME రీస్టార్ట్ ప్యాకేజీ
మే 26 – లాక్ డౌన్ వలన జీవనోపాది లేక ఇబ్బంది పడుతున్న అర్చకులు , ఇమాం, మూజంలకు, పాస్టర్లకు ఒక్కొక్కరికి 5వేలు చొప్పున ఆర్ధిక సహాయం
మే 31 – వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
_______________

జూన్ 4 – రెండో విడత వైయస్సార్ వాహన మిత్ర
జూన్ 10 – రజక, నాయి బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములకు , అక్కచెల్లెలకు జగన్ అన్న చేదోడు
జూన్ 20 – రెండో ఏడాది వైయస్సార్ నేతన్న నేస్తం
జూన్ 24 – వైయస్సార్ కాపు నేస్తం
జూన్ 26 – 2018-19 పంటభీమా రాష్ట్ర ప్రభుత్వ వాటా బకాయి చెల్లింపు
జూన్ 29 – చిన్న పరిశ్రమలకు MSME రీస్టార్ట్ ప్యాకేజీ రెండో విడత విడుదల , గత ప్రభుత్వం MSMEలకు పెట్టిన బకాయిలు విడుదల
______________

జులై 1 – రాష్ట్ర వ్యాప్తంగా 104,108 (1,088) అంబులెన్స్ సర్వీసులు ప్రారంభం
జులై 3 – ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పోరేషన్ ఏర్పాటు
జులై 8 – గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,053.42 వడ్డీలేని రుణాల రాయితీల బకాయిల చెల్లింపు
జులై 17 – క్యాన్సర్ చికిత్స తో సహా 2,200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు పరిధి వర్తింపు .
జులై 22 – జగన్ అన్న పచ్చతోరణం (పర్యావరణ పరిరక్షణకు 20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం)
______________

ఆగస్టు 12 – మహిళా సాదికారతే లక్ష్యంగా వైయస్సార్ చేయూత
______________

సెప్టెంబర్ 5 – రాబోయే 30 ఏళ్ళు రైతులకు ఉచిత వ్యవసాయ విధ్యుత్ గ్యారెంటి
సెప్టెంబర్ 7 – తల్లీ బిడ్డల వికాసం కోసం వైయస్సార్ సంపూర్ణ పోషణ
సెప్టెంబర్ 11 – అక్కచెల్లెమ్మల ఆర్ధికాభివృద్దే లక్ష్యంగా వైయస్సార్ ఆసరా
సెప్టెంబర్ 28 – రైతన్నల పొలాలకు జలసిరులు అందించేందుకు వైయస్సార్ జలకళ
______________

అక్టోబర్ 1 – వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతుధర ప్రకటన
అక్టోబర్ 2 – గిరిజనులకు కానుక అటవీ హక్కు పత్రాల పంపిణీ
అక్టోబర్ 8 – విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు – జగన్నన విధ్యాకానుక
అక్టోబర్ 16- వెనుకబడిన వర్గాలైన బీసీలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు
అక్టోబర్ 20 – ఆప్కో ఆన్లైన్ స్టోర్ – లేపాక్షి వెబ్ స్టోర్
అక్టోబర్ 21 – పేద కుటుంబాలకు ధీమా పెరిగేలా వైయస్సార్ భీమా
అక్టోబర్ 27 – రెండో ఏడాది 2వ విడత రైతన్నలకు పెట్టుబడి సాయం వైయస్సార్ రైతు బరోసా
_______________

నవంబర్ 7 – పధకాలు పొందేందుకు పేర్లు నమోదు చేసుకోవడంలో పొరపాట్లు జరిగి పధకాలు అందని 4,39,044 మంది లబ్దిదారులను వెరిఫై చేసి వారి ఖాతాలోకి 737.14 కోట్లు జమ
నవంబర్ 10 – ఆరోగ్యశ్రీ పరిధిలోకి గతంలో ఉన్న 2200 చికిత్సలు కాక కొత్తగా 234 చికిత్సలు చేరుస్తూ ఉత్తర్వులు
నవంబర్ 17 – రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గిస్తూ వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పధకం
నవంబర్ 21 – రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్ల , ఆక్వా హబ్ నిర్మాణంలో భాగంగా తొలి విడతగా 4 ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్బులకు శంఖుస్థాపన
నవంబర్ 24 – మహిళల సురక్షితంగా ప్రయాణం చేసేందుకు వారి భద్రతకై అభయం యాప్ విడుదల
నవంబర్ 25 – చిరు వ్యాపారులకు, చేతి వృత్తులవారి ఆర్ధిక అవసరాలు తీర్చడానికి జగనన్న తోడు
_______________

డిసెంబర్ 2 – రాష్ట్రంలో పాడి రైతులు లీటర్ పాలకు కనీసం 4 రూపాయలు అదనంగా ఆదాయం పొందేలా అమూల్ పాల వెల్లువ
డిసెంబర్ 10 – అక్కచెల్లెమ్మలకు మెరుగైన జీవనోపాది కలిగేలా జగనన్న జీవ క్రాంతి పధకం ద్వారా గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణి
డిసెంబర్ 15 – 2019 లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకి ఉచిత పంట భీమా విడుదల
డిసెంబర్ 21 – వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పధకం ప్రారంభం
డిసెంబర్ 25 – 30.76 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ పధకం ప్రారంభం
డిసెంబర్ 29 – మూడో విడత వైయస్సార్ రైతు భరోసా – నివార తుఫాన్ పంట నష్ట పరిహారం విడుదల ….