iDreamPost
iDreamPost
జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా ఉగ్రవాదులు కాల్పుల్లో చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన వీర జవాన్ హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీర మరణం పొందిన విషయం తెలిసిందే. 18 ఏళ్లుగా భారత సైన్యంలో పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ ఉగ్రమూకల కాల్పులో మరణించాడనే సమాచారం అందడంతో ఆయన కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అయితే దేశంకోసం ప్రాణాలను పణంగా పెట్టిన ప్రవీన్ కుమార్ రెడ్డి సాహసం వెలకట్టలేనిదని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. వీర జవాన్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఈ కష్ట సమయంలో కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ వీర జవాన్ భార్య రజితకు లేఖ రాశారు.
అలాగే సీఎం జగన్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి రెడ్డెప్ప స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు జవాన్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.