iDreamPost
android-app
ios-app

బాక్సాఫీస్ బరిలో ఇద్దరూ పోటీపడక తప్పదా

  • Published Apr 28, 2021 | 5:25 AM Updated Updated Apr 28, 2021 | 5:25 AM
బాక్సాఫీస్ బరిలో ఇద్దరూ పోటీపడక తప్పదా

కరోనా విజృంభిస్తున్న వేళ సినిమా విడుదల తేదీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇంకొంత భాగం మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉన్న యూనిట్ లకు ఈ సమస్య అధికంగా ఉంది. ఇంకొక్క పది పదిహేను రోజులు వర్క్ చేస్తే ఆచార్య పూర్తయిపోయేది. కానీ మళ్ళీ బ్రేక్ పడింది. విడుదల వాయిదాని నిన్న అధికారికంగా ప్రకటించారు కానీ తిరిగి ఎప్పుడు ఉండొచ్చనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జూన్ జూలైలో రావడం అనుమానమేనని ఇన్ సైడ్ టాక్. దానికి తగ్గట్టే డిస్ట్రిబ్యూటర్లను ఆగస్ట్ కి సిద్ధంగా ఉండమని ముందస్తు సంకేతాలు ఇచ్చారట.

ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. మోహన్ లాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం మరక్కర్ ని గతంలో మే 13 అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఫ్రెష్ గా ఆగస్ట్ 12 ఫిక్స్ చేశారు. అంటే పుష్ప కు ఒక్క రోజు ముందు. పుష్ప వచ్చే అవకాశం ఎలాగూ తగ్గిపోతోంది కాబట్టి ఆ తేదీలో ఆచార్యను దింపాలని కొణిదెల టీమ్ ప్లాన్. అయితే ఇప్పుడు మరక్కర్ నేరుగా పోటీ పడటం వల్ల తెలుగు రాష్ట్రాల వరకు వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం ఓపెనింగ్స్ పరంగా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ముందస్తు జాగ్రత్తగా మరక్కర్ టీమ్ చాలా తెలివిగా డేట్ మీద కర్చీఫ్ వేసినట్టు అర్థమవుతోంది. దీని ఫస్ట్ కాపీ 2019లోనే రెడీ అయ్యింది.

సరే వీటి సంగతలా ఉంచితే మున్ముందు ఇలాంటి పరిణామాలు చాలా చోటు చేసుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్, మేలో రావాల్సిన క్రేజీ మూవీస్ అన్నీ వాయిదా పడటంతో ఒకవేళ జూన్ నుంచి కనక అంతా నార్మల్ అయితే అప్పుడు క్లాష్ లు తప్పకపోవచ్చు. ఏది బాగుంటే అది ఆడుతుందని నమ్ముకుని పోటీకి సిద్ధపడాలి తప్పించి వేరే ఆప్షన్ లేదు. ఎటొచ్చి నలిగిపోయేది చిన్న సినిమాలే. కాంపిటీషన్ కి సై అనలేక ఓటిటికి వెళ్లేంత రేట్ రాక ఇవి పడే బాధలు అంతా ఇంతా కాదు. అందుకే 2020ని మించిన సంక్షోభం రాబోయే రోజుల్లో కళ్ళముందు కనిపిస్తోంది. కరోనా భూతం త్వరగా సెలవు తీసుకుంటే తప్ప ఇది తెమలదు