iDreamPost
android-app
ios-app

చిరు సల్మాన్ పాటలో అసలు ట్విస్టు

  • Published Sep 22, 2022 | 6:54 PM Updated Updated Sep 22, 2022 | 6:54 PM
చిరు సల్మాన్ పాటలో అసలు ట్విస్టు

గత నాలుగు రోజులుగా నాన్చి నాన్చి ఆఖరికి నిన్న విడుదల చేసిన తార్ మార్ తక్కర్ మార్ లిరికల్ వీడియో యూట్యూబ్ లో బాగానే దూసుకుపోతోంది 24 గంటల్లోనే ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకుని ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. గాడ్ ఫాదర్ మీద ఇప్పటికే ఉన్న నెగటివ్ పబ్లిసిటీని తగ్గించేందుకు మొన్న చిరు వదిలిన చిన్న ఆడియో క్లిప్ ఉపయోగపడితే ఇప్పుడీ సాంగ్ తాలూకు విజువల్స్ మరికొంత హెల్ప్ అయ్యాయి. చిరంజీవి సల్మాన్ ఖాన్ ప్రభుదేవా ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేయడాన్ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొరియోగ్రఫీ కంపోజింగ్ తాలూకు కొన్ని బిట్స్ వదిలారు తప్పించి అసలైన కిక్కిచ్చే మూమెంట్స్ మాత్రం దాచేశారు.

ఇదంతా బాగానే ఉంది కానీ గాడ్ ఫాదర్ లో ఈ పాట ప్లేస్ మెంట్ ఎక్కవ వస్తుందనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో ఈ పాత్రలు వేసిన మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ లు స్టెప్పులు వేయరు. ఒక ఐటెం సాంగ్ లో కేవలం అలా కనిపించి వెళ్తుంటారు. అది కూడా మెగా మూవీలో ఉంది. అలాంటప్పుడు తక్కర్ మార్ ని ఎక్కడ పెడతారనే సందేహం రావడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం గాడ్ ఫాదర్ సినిమా మొత్తం అయ్యాక ఎండ్ టైటిల్స్ కు ముందు మాత్రమే ఇది వస్తుందట. అంటే స్టోరీకి ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇవ్వడం కోసమే సెట్ చేశారు తప్ప ఇంకే కారణమూ లేదన్న మాట.

ఇలా చేయడం వల్ల ఆడియన్స్ చివరి దాకా కదలకుండా కూర్చుంటారు. పైగా హిందీ డబ్బింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి అక్కడి ప్రేక్షకులను లాస్ట్ దాకా చూసేలా చేయడం కీలకం. సల్లు భాయ్ స్టెప్పుల కోసమైనా రెడీ అవుతారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తుండగా నయనతార అతని భార్యగా చిరు సవతి చెల్లిగా ముఖ్యమైన క్యారెక్టర్ చేసింది. ఈ సిస్టర్ సెంటిమెంట్ బాగా పండిందని ఇన్ సైడ్ టాక్. 25 ట్రైలర్ లాంచ్, 28న అనంతపూర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రెడీ అవుతున్న మెగాస్టార్ ప్రస్తుతం వాల్తేర్ వీరయ్యకు సంబంధించిన చిన్న షెడ్యూల్ కోసం రాజమండ్రిలో ఉన్నారు.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş