iDreamPost
android-app
ios-app

నానికి పవన్ చిరుల సెంటిమెంట్

  • Published Oct 26, 2020 | 10:11 AM Updated Updated Oct 26, 2020 | 10:11 AM
నానికి పవన్ చిరుల సెంటిమెంట్

టక్ జగదీశ్ తర్వాత నాని చేయబోతున్న శ్యామ్ సింగ రాయ్ మీద అంచనాలు షూటింగ్ మొదలుకాకుండానే ఎగబాకుతున్నాయి. ఇప్పటికే బడ్జెట్ కారణంగా నిర్మాత మారారు. నిన్నే అధికారికంగా ప్రకటించారు కూడా. లాక్ డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితుల వల్ల సితార సంస్థ దీని గురించి వెనుకడుగు వేయడంతో ప్రొడ్యూసర్ పేరు చేంజ్ అయ్యిందని ఇప్పటికే ఫిలిం నగర్ టాక్ జోరుగా ఉంది. హీరోయిన్లుగా సాయి పల్లవి, కృతి శెట్టిని ఫైనల్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి.

శ్యామ్ సింగ రాయ్ అధికశాతం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. మీసం మెలితిప్పిన ఓ పవర్ ఫుల్ పాత్రలో నానిని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నట్టు తెలిసింది. యాక్షన్ డ్రామాతో ఊహించని మలుపులతో సాగుతుందట. అయితే ఈ విషయంలో నానికి చిరు పవన్ ల సెంటిమెంట్ కలిసి వస్తుందేమో చూడాలి. 1998లో వచ్చిన చూడాలని ఉంది మూవీ అరవై శాతం పైగా కోల్కతా వాతావరణంలోనే ఉంటుంది. ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది. 2001లో విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషిలోనూ ఇదే నేపధ్యం చూడొచ్చు. అది ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి రెండు వందల రోజులు ఆడేసింది.

చిరు చేయబోయే వేదాళం రీమేక్ లోనూ కోల్కతానే ఉంటుందట. సో ఈ లెక్కన శ్యామ్ సింగ రాయ్ కు ఇది కూడా కలిసి వస్తుందేమో చూడాలి. వి డిజాస్టర్ అయినప్పటికీ నానికి పెద్దగా ఇబ్బందేమీ కలగలేదు. ఒకవేళ థియేటర్లలో వచ్చి ఉంటే నష్టాల లెక్కలు బయటికి వచ్చి కొంత ప్రభావం జరిగేదేమో కానీ ఓటిటి రిలీజ్ కావడం వల్ల డ్యామేజ్ దాదాపు తగ్గింది. టక్ జగదీశ్ మీద నానికి మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో మళ్ళీ ట్రాక్ లో పడి శ్యామ్ సింగ రాయ్ తో మారోసారి భలే భలే మగాడివోయ్ స్థాయి సక్సెస్ అందుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఇవి అయ్యాక బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయతో న్యాచురల్ స్టార్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇంకో రెండు చర్చల దిశలో ఉన్నాయి కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది