iDreamPost
android-app
ios-app

రెచ్చగొట్టిన చింతమనేని.. మరోసారి అరెస్ట్!

రెచ్చగొట్టిన చింతమనేని.. మరోసారి అరెస్ట్!

వివాదాలలో ఎప్పుడూ ముందుండే పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు గురువారం మరోసారి అరెస్టు చేశారు.

ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టేలా

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బుధవారం రాత్రి పెదవేగి మండలం బి సింగవరం గ్రామానికి వచ్చిన చింతమనేని ప్రభాకర్ వచ్చారు. ఈ గ్రామంలో టిడిపి బలం కాస్త అధికం కావడంతో చింతమనేని రెచ్చిపోయారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో స్థానికంగా ఉన్న కొందరు వైకాపా కార్యకర్తలు మీద టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ప్రచారం చేయడానికి వచ్చిన చింతమనేని ఇస్టానుసారం స్థానిక వైకాపా నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎంతోకాలం ప్రభుత్వం ఉండదని వచ్చాక అందరి భరతం పడతాం అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో గ్రామంలో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సుమారు ఎనిమిది మంది వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Also Read:నడిరోడ్డులో,అందరూ చూస్తుండగా హత్యలు..ఎంటీ వైపరీత్యం ?

గురువారం అరెస్ట్!

బి సింగవరం గ్రామం లో జరిగిన ఘర్షణ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. నాలుగవ దశలో ఏలూరు డివిజన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో ఏలూరు మండలం మాదేపల్లి లో ప్రచారానికి వెళ్తున్న చింతమనేని వాహనాన్ని మధ్యలోనే అడ్డగించి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు అరెస్టు సమయంలో చింతమనేని హైడ్రామా ఆడారు. అరెస్ట్ చేసేటపుడు పోలీసు వాహనంలో తరలించడం ఆనవాయితీ. దీంతో పోలీసులు వచ్చి వాహనం ఎక్కాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని కోరగా, మీడియాని చూసి రెచ్చిపోయిన ఆయన తాను వాహనంలోనే పోలీస్ స్టేషన్ కు వస్తానని ఎక్కడికీ పారిపోనని మొండికేశారు.

Also Read:ఇలా చేద్దాం! పరిశ్రమ కాపాడుకుందాం! విశాఖ ఉక్కు పై జగన్ విజన్ వేరు!!

బుధవారం రాత్రి జరిగిన గొడవ విషయం మొత్తం ముందే తెలుసుకున్న చింతమనేని ఏ ఏ సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు అంటూ పోలీసులతో వాదించారు. తన వద్ద కూడా సమాచారం ఉందంటూ కేసు తాలూకా ఎఫ్ఐఆర్ను తీసే ప్రయత్నం చేయగా, పోలీసులు ముందు వచ్చి వాహనం ఎక్కాలని కోరడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. చివరకు ఆయనకు సర్ది చెప్పిన తర్వాతే పోలీసులు అరెస్ట్ చేసి, పెదవేగి పోలీస్ స్టేషన్కు తరలించారు.