iDreamPost
iDreamPost
కోవిడ్ 19 పుట్టుకకు కారణమైందన్న (అనుమానాలైతే జనంలో ఉన్నాయి) బలమైన కారణంతో ప్రపంచ వ్యాప్తంగా చైనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనడంలో సందేహం లేదు. చాలా దేశాలు నేరుగానే బైటపడగా, ఇంకొన్ని దేశాలు లోలోపల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు అంతర్జాతీయంగా వెలువడుతున్న పలు వార్తాకథనాల ద్వారా స్పష్టమవుతూనే ఉంది.
ప్రస్తుత శతాబ్దంలో ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిల్చున్న చైనా పట్ల ఆదినుంచీ ఇతర దేశస్తుల్లో అనేకానేక అనుమానాల ఉన్నాయి. చైనా పైకి చెప్పేదొకటి చేసేదొకటి అన్నది ప్రధాన ఆరోపణ. ఆ దే«శంలో నెలకొన్న నిరంకుధ పరిస్థితులు, జనం వెతలు బైట ప్రపంచానికి తెలియకుండా ఆ దేశం జాగ్రత్తలు తీసుకుంటుందన్నది మరో ఆరోపణ. ఏది ఏమైనా ఆ దేశ నాయకులు మాత్రం తామేం చేద్దామనుకుంటున్నారో అది మాత్రమే చేస్తూ అంతర్జాతీయంగా తమ ప్రాభవాన్ని కాపాడుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ 19 పుట్టుక ఆ దేశం నుంచే ప్రారంభం కావడంతో చైనాపై లోలోపలే రగులుతున్న పలు దేశాలు నేరుగానే ఆ దేశంవైపు వేలెత్తి చూపాయి. వైరస్ సంబంధిత సమాచారం ముందుగా వెల్లడి చేయలేదని, ఇతర దేశాలను అప్రమత్తం చేయడంలో ఆలస్యం చేసిందని తదితర కారణాలతో ఇప్పుడు వైరస్ కారణంగా నానా పాట్లు పడుతున్న దేశాల్లో ఇంకా చైనా పట్ల తీవ్ర ఆగ్రహమే ఉందని చెప్పొచ్చు.
ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్‌కు ఎదుర్కొనేందుకు తాము తయారు చేస్తున్న నాలుగు వ్యాక్సిన్లలో మూడు చివరి దశకు చేరుకున్నాయని ఆదేశంలోని నిపుణులు పేర్కొనడం ఇప్పుడు మరోమారు చైనా వైఖరి పట్ల సందేహాలు రేకెత్తిస్తున్నాయి. నిజం చెప్పాలంటే కరోనాను చూసి ఎంతగా భయపడుతున్నారో చైనాపేరు చెప్పినే అదే స్థాయిలో జడుసుకుంటున్నారన్నది వాస్తవం.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో యాభైమూడు వ్యాక్సిన్లు క్లినికల్ పరీక్షలు జరుపుకుంటున్నట్లుగా అంచనా. వ్యాక్సిన్ ప్రతి దశలోనూ పురోగతిని ప్రపంచానికి వెల్లడిస్తూ, జనంలో ఒక విధమైన భరోసాను ఆయా దేశాలు ఇప్పటి వరకు కల్పిస్తున్నారు. అదే రీతిలో ఒక వ్యాక్సిన్ ట్రయల్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుందన్న వార్త ప్రపంచం మొత్తాన్ని ఆవైపు తిరిగిచూసే విధంగా చేసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జనం అటెన్షన్ కోవిడ్‌వ్యాక్సిన్ వైపే ఉందనడానికి ఇదే నిదర్శనం.
ప్రపంచ దేశాలన్నీ ఇంతగా హైరానా పడుతుంతే.. తీరాగ్గా ఇప్పుడు డ్రాగన్ దేశం మేమూ తయారు చేస్తున్నాం.. అంటూ చెప్పుకురావడం వైరస్ బాధిత దేశాలకు ఒళ్ళుమండుకొచ్చే విషయమే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చైనా వ్యాక్సిన్‌పై జోకులు కూడా పేలిపోతున్నాయి. చైనా వస్తువులకు మాదిరిగానే గ్యారెంటీ, వారంటీల్లేకుండానే వ్యాక్సిన్ ఉంటుందేమో.. అంటూ తమ కడుపుమంటను పలువురు నెటిజన్లు వెళ్ళగక్కుతున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్‌లోకి వ్యాక్సిన్ వస్తే తప్ప సదరు చైనాటీకాపై పూర్తిస్థాయి నమ్మకాన్ని ఆ దేశం తప్ప ఇంకెవరూ ఉంచలేరన్నది అందరూ ఒప్పుకునే వాస్తవం.