ఇది పెళ్లి వేడుకల్లో భాగంగా అలంకరించిన గృహం అనుకుంటున్నారా..? లేదా స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా విద్యుద్దీపాలతో అలంకరించిన అధికారుల భవనం అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఇది ఒక పోలీస్ స్టేషన్.. పోలీస్ స్టేషన్ ని ఈ రకంగా విద్యుద్దీపాల వెలుగుల్లో అలంకరించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఒకసారి పరుశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి.
మహారాష్ట్రలోని చిఖ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 ఏళ్ల బాలికను ఇద్దరు నిందితులు దారుణంగా అత్యాచారం చేశారు. కాగా ఈ కేసును బుల్దానా జిల్లా చిఖ్లీ పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా కోర్టుకు బలమైన సాక్ష్యాధారాలు సమర్పించడంతో కోర్టు ఇద్దరు నిందితులను ఉరిశిక్ష విధించింది..
దీంతో పోలీసులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. పోలీస్ స్టేషన్ మొత్తాన్ని విద్యుద్దీపాల వెలుగులతో నింపేశారు. అభంశుభం తెలియని చిన్నారిని అత్యాచారం చేసిన నిందితులకు సరైన శిక్ష పడిందని పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు మీడియాలో చిఖ్లీ పోలీస్ స్టేషన్ ఫోటోలు వైరల్ గా మారాయి.