Idream media
Idream media
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంశంపై దేశంలో ఇంకా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ చట్టంపై ప్రముఖుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దేశంలో నిరసనలకు కారణం రాజకీయ పార్టీల నేతలే అని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆర్మీ చీఫ్‌పై ఫైర్ అయ్యారు. తాము ఏమి చేయాలో తమకు తెలుసన్నారు. యుద్ధంలో మీరు ఎలా పోరాడాలో ఆలోచించండన్నారు. యుద్ధం ఎలా చేయాలో మేము మీకు నేర్పింస్తున్నామా..? అంటూ ప్రశ్నించారు. మీ పని మీరు చూసుకోండని హితవు పలికారు.