iDreamPost
android-app
ios-app

ప్రజలకు అండగా.. చెవిరెడ్డి వితరణ అసామాన్యం…

ప్రజలకు అండగా.. చెవిరెడ్డి వితరణ అసామాన్యం…

అధికారంలో ఉన్నా లేకపోయినా, తాను కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే రాజకీయ నాయకులు చాలా అరుదు. అలాంటివారిలో చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డిది ప్రత్యేక స్థానం. ప్రజలకెప్పుడూ అందుబాటులో ఉంటూ, పార్టీలకతీతకంగా సంక్షేమ పథకాలను చేరవేస్తూ ఆయన ముందుకు సాగుతుంటారు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన అందిస్తున్న సహాయ సహకారాలు చూపి విపక్షాలు సైతం ఫిదా అవుతున్నాయి.

ఎప్పుడూ ప్రజల మధ్యే…
2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ తనను నమ్మి గెలిపించిన ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ అర్ధరాత్రి పిలిచినా వెళ్లి సమస్యను పరిష్కరించి వచ్చేవారు. కరువు, అకాల వర్షాలు వచ్చినప్పుడు నష్టపోయిన రైతులకు సొంత ఖర్చులతో సహాయ కార్యక్రమాలు చేసేవారు. ప్రతి ఇంటికీ కూరగాయలు, నిత్యావసరాలు అందించేవారు. పండుగల సమయంలో అవసరమయ్యే సామగ్రిని ఇంటింటికీ అందజేసేవారు.

అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ ప్రతి ఏడాది మట్టితో చేసిన వినాయకులను సరఫరా చేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు పేపర్, జ్యూట్‌ బ్యాగులను అందిస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా భారీ స్థాయిలో టోర్నమెంటులను నిర్వహించి ప్రతిభ గల క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

కరోనా భూతంపై చెవిరెడ్డి యుద్ధం..
2019లో రెండో సారి గెలిచిన తర్వాత ప్రభుత్వ సహకారంతో ఆయన ప్రజలకు మేలు చేసేందుకు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో ఆయన ప్రజలకు భరోసాగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ దాదాపు 3 లక్షల 50 వేల శానిటైజర్లను, మాస్కులను రెండు సార్లు ఉచితంగా సరఫరా చేశారు. అలాగే లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసరాలతో కూడిన కిట్లను అందించారు.

అదే సమయంలో నియోజకవర్గంలో కరోనా నివారణకు కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ఇతర అధికారులకు మొత్తం 11,500 మందికి 1.50 కోట్ల విలువైన 25 రకాల నిత్యావసరాలను అందజేశారు. నేడు, రేపు మరోసారి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికీ పది కోడిగుడ్లు, 10 కిలోల చొప్పున 1600 టన్నుల కూరగాయలు, 15 చొప్పున 23 లక్షల విటమిన్‌ సి టాబ్లెట్లు పంపిణీ చేయనున్నారు.

లాక్ డౌన్ సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు మరింత చేయూతనిచ్చేందుకు చెవిరెడ్డి ఈ ప్రణాళిక రచించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ కుటుంబానికి డజను కోడిగుడ్లు చొప్పున పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత పది కేజీల చొప్పున కూరగాయలు పంపిణీ చేయాలని సంకల్పించారు. ఈ కార్యక్రమం తర్వాత సి విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకొచ్చారు. ఆ స్పూర్తితో అనేకమంది శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు వీలైనంత సహాయం చేసేందుకు సంకల్పించారు.