iDreamPost
iDreamPost
గత ఏడాది లాక్ డౌన్ కు ముందు భీష్మతో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న చెక్ నిన్నటితో మొదటి వారం పూర్తి చేసుకుంది. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా రాకపోవడంతో ఫ్లాప్ ముద్ర వేసుకుని ఫైనల్ రన్ దిశగా అడుగులు వేస్తోంది. ముందస్తు చేసుకున్న అగ్రిమెంట్ లో భాగంగా చాలా కేంద్రాల్లో రన్ చేస్తున్నారు కానీ మొన్న సోమవారం నుంచే వసూళ్లు బాగా డౌన్ అయ్యాయి. చాలా చోట్ల ఉప్పెన కంటే తక్కువ టికెట్లు తెగాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సుమారు 15 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న చెక్ ఇప్పటిదాకా సగంపైన రాబట్టడానికే ముచ్చెమటలు చిందించింది
వారం రోజులకు గాను 9 కోట్ల 2 లక్షలు రాబట్టుకుని నితిన్ కు మరో డిజాస్టర్ ని ఖాతాలో వేసేందుకు రెడీ అయ్యింది. కనీసం డివైడ్ టాక్ వచ్చినా మాస్టర్, రెడ్ తరహాలో సేఫ్ ప్రాజెక్ట్ అయ్యేది. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని చెస్ కాన్సెప్ట్ ని తీసుకోవడమే కాక లాజిక్స్ ని పూర్తిగా వదిలేసి నెల విడిచి సాము చేసిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మొదటిసారి ప్రతికూల ఫలితాన్ని అందుకున్నారు. ఫ్లాప్ అన్న సాహసం, మనమంతా, ప్రయాణం లాంటివి కనీసం విమర్శకులనైనా మెప్పించాయి కానీ చెక్ అది కూడా చేయలేకపోయింది. ఇక ఏరియాల వారీగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి
ఏరియా వారి మొదటి వారం వసూళ్లు :
ఏరియా | షేర్ |
నైజాం | 3.20cr |
సీడెడ్ | 0.96cr |
ఉత్తరాంధ్ర | 1.13cr |
గుంటూరు | 0.92cr |
క్రిష్ణ | 0.53cr |
ఈస్ట్ గోదావరి | 0.45cr |
వెస్ట్ గోదావరి | 0.55cr |
నెల్లూరు | 0.28cr |
ఆంధ్ర+తెలంగాణా | 8.03cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.31cr |
ఓవర్సీస్ | 0.68cr |
ప్రపంచవ్యాప్తంగా | 9.02cr |
ఇవాళ ఏకంగా 11 తెలుగు సినిమాలు విడుదల కావడంతో చెక్ ఇకపై రికవరీ చేసుకోవడం కష్టం. ఏదైనా లాస్ట్ ఛాన్స్ ఉంది అంటే అది ఈ వీకెండ్ మాత్రమే. ఒకవేళ చెప్పుకోదగ్గ ఫిగర్స్ నమోదైతే బయ్యర్ల నష్టం శాతం తగ్గుతుంది. లేదా ఇంకేమి చేయలేని పరిస్థితి నెలకొంటుంది. చాలా తక్కువ టైంలో సరైన స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకోకుండా చెక్ ని వండిన తీరు ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్ చూస్తే ఉప్పెన, నాందిలు తమ రన్ ని అలాగే కొనసాగిస్తున్నాయి. ఇవాళ ఏ1 ఎక్స్ ప్రెస్, పవర్ ప్లే టాక్ ని బట్టి ఇవి ఎంతవరకు ప్రభావితం అవుతాయో చూడాలి