iDreamPost
android-app
ios-app

వైసీపీ గెలుపుకు మరో కొత్త కారణం చెబుతున్న చంద్రబాబు

వైసీపీ గెలుపుకు మరో కొత్త కారణం చెబుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు అయింది. 2019 ఏప్రిల్‌ 11వ తేదీన ఏపీలో పోలింగ్‌ జరిగింది. ఎన్నికలు జరిగి రెండేళ్లు అవుతున్నా.. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లుగా ఆయన వ్యవహార శైలి ద్వారా తెలుస్తోంది. పోలింగ్‌ జరిగి రెండేళ్లు అవడంతో నాటి ఫలితాలను చంద్రబాబు తలుచుకుంటున్నారు.

2019 ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి చంద్రబాబును వెంటాడుతూనే ఉందని తాజాగా వైసీపీ గెలుపుపై ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. తాను ఎందుకు ఓడిపోయానో తెలియడంలేదంటూ నిన్నమొన్నటి వరకు సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పిన చంద్రబాబు.. అదే సమయంలో వైసీపీ గెలుపును తక్కువ చేసి చూపేలా, ప్రజా తీర్పును అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేశారు. ఈ పరంపరను టీడీపీ అధినేత కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై చంద్రబాబు అవాకులు చవాకులు పేలారు. ఆ ఎన్నికల్లో డబ్బులు, బెదిరించడం వల్లనే వైసీపీ గెలిచిందని చెప్పుకొచ్చారు.

Also Read : టీడీపీకి పెద్దిరెడ్డి దిమ్మ తిరిగే స‌వాల్

చంద్రబాబు మాటలు విన్న వారు నాలుక్కరుచుకుంటున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఐదేళ్లలో మట్టి, ఇసుక, మద్యం, నీరు చెట్లు.. ఇలా ప్రతి చోటా అవినీతి విలయతాండవం చేసింది. అధికారంలో టీడీపీ ఉంది. డబ్బు, అధికార బలం టీడీపీకి ఉంటే.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ డబ్బులు, బెదిరింపుల వల్ల గెలిచిందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. అధికారంలో లేని వాళ్లు ఎలా..? ఏమని బెదిరిస్తారో..? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకే తెలియాలి.

చంద్రబాబు తాజా వ్యాఖ్యలు పరిశీలిస్తే.. వైసీపీ గెలుపునకు ఆయన చెప్పిన కొత్త కారణాలు ఇవి. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వైసీపీ గెలుపునకు పలు కారణాలు చెప్పారు. ఈవీఎంల ద్వారా వైసీపీ గెలిచిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ను… ఈవీఎం ముఖ్యమంత్రి అంటూ ప్రజా తీర్పును హేళన చేశారు. మరోసారి జగన్‌ మంచిగా పాలిస్తారనే నమ్మకంతో ప్రజలు ఓట్లేశారని చెప్పారు. ఇంకోసారి ఒక్క ఛాన్స్‌ అని జగన్‌ అడిగితే ప్రజలు ఓట్లేశారని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇప్పుడు బెదిరించడం వల్ల గెలిచారంటున్నారు. వైసీపీ గెలుపునకు ఇన్ని కారణాలు చెబుతున్న చంద్రబాబు.. తన ఓటమికి గల కారణాలు రెండేళ్లు అవుతున్నా తెలుసుకోలేకపోవడమే విచ్రితం.

Also Read : మళ్లీ గ్లాసు మీద మనసుపడ్డావా బాబు!