iDreamPost
iDreamPost
తాను ఎప్పుడో MA పూర్తి చేశామని, మీలా అక్కడా… ఇక్కడా పిచ్చాపాటీ గా చదువుకుని రాలేదని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లను ఉద్దేశించి అన్నారు.
మూడవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఆంగ్ల మధ్యమం పై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. నాడు తాను ఆంగ్ల మధ్యమం ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంటే జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకించాడని అదే జగన్ నేడు తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం ఎలా పెడుతున్నారని, అమ్మ భాషను చంపేస్తున్నారని అన్నారు. తెలుగు దేశం పార్టీ ఎప్పుడు ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడు కోవాలంటే తెలుగు మీడియం తప్పని సరి అని మాత్రమే అంటున్నానని అన్నారు.
నేను ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడితే నాకు ఇంగ్లీష్ రాదని అంటారు. అసలు వీళ్లకు నాగురించి ఏమి తెలుసు…నేను చేసిన అభివృద్ది,నేను ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని చెప్పారు. నన్ను అనవసరంగా రెచ్చకొట్టకండి. నేను రెచ్చిపోతే మీరు తట్టుకోలేరు, నేను ఎప్పుడో MA పూర్తి చేసానని, ముందు అది తెలుసు కోవాలని సూచించారు.
చంద్రబబు వాఖ్యల మీద స్పందించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న దానికి చంద్రబాబు నాయుడు పూర్తి వ్యతిరేకమని అన్నారు. చంద్ర బాబు నాయుడు హయాం లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చాను అని గొప్పలు చెపుతున్న ఆయన హయాంలో తెలుగు మీడియం పర్సెంట్ 65 శాతం ఉండగా, ఇంగ్లీష్ మీడియం పర్సెంట్ 35 గా ఉందని వివరించారు. తన బినామీ అయిన నారాయణ విద్యాసంస్థలను బతికించటానికి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి, ప్రైవేట్ పాఠశాలలకు ఊతం ఇచ్చారన్నారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం పేదలు తమ పిల్లలను సైతం ఇంగ్లీష్ ను హక్కుగా భావించి అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తపనతోనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తున్నారని, ఎవరు ఏమి చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి తీరుతామని అన్నారు. తాము అధికారం లో ఉన్నపుడు ఇంగ్లీష్ మీడియం కు అడ్డుతగిలారని చంద్రబాబు చెపుతున్నారు… ఎవరు అడ్డుతగిలినా నాడు అధికారంలో ఉన్నది వారేనని, ప్రవేశపెట్టాలి అని అనుకున్నప్పుడు ఎందుకు ప్రవేశ పెట్టలేకపోయారని జగన్ చురకలంటించారు. ప్రతి విషయం లో వక్రీకరణలు చేస్తూ, దిక్కుమాలిన ఆలోచనలు చేయడం వల్ల చంద్రబాబును చూసి రాష్ట్ర మంతా సిగ్గుతో తల దించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇంగ్లీష్ మీడియం మీదే మాట్లాడుతామని అనుకుంటే రేపు ఇదే అంశం పై సుదీర్ఘంగా చర్చ సాగిస్తామని సూచించారు. ఇక ఇదే విషయం పై ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడారు. చంద్ర బాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, తాను 1972 లో MPhil చేసానని చెపుతున్నారు…అయితే ఎస్వీ యూనివర్సిటీ లో MPhil 1980 లో ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ఇక PhD చేస్తున్నానని 40 ఏళ్లుగా చెపుతూనే ఉన్నారని, వ్యక్తిగత దూషణలు మాని వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.