iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు అనుమతి కావాలట.. వివాదం రేపటమే టార్గెట్టా ?

  • Published May 24, 2020 | 3:37 AM Updated Updated May 24, 2020 | 3:37 AM
చంద్రబాబుకు అనుమతి కావాలట.. వివాదం రేపటమే టార్గెట్టా ?

మొత్తానికి దాదాపు 50 రోజుల అజ్ఞాతవాసాన్ని వదిలించుకోవాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయ్యాడు. కరోనా వైరస్ దెబ్బకు అప్పుడెప్పుడో ఏపిలోని అమరావతి నుండి హైదరాబాద్ కు కొడుకు, మాజీ మంత్రి నారా లోకేష్ తో సహా చంద్రబాబు వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. జనజీవనస్రవంతికి దూరమైపోయిన చంద్రబాబు అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగానే ట్విట్టర్ వేదికగానే జనాలతో టచ్ లో ఉన్నారు. అలాగే జూమ్ యాప్ ద్వారా నేతలతో సమావేశాలు, పాలిట్ బ్యూరో సమావేశాలు కూడా నిర్వహించేస్తున్నారు.

అలాంటిది ఇన్ని రోజులకు ఏపిలొకి అడుగుపెట్టాలని అనుకుంటున్నాడు. అందుకనే డిజిపి గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశాడు. తాను ఏపిలోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు లేఖలో చెప్పాడు. అనుమతిస్తే నేరుగా హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళే విమానంలో ప్రయాణించనున్నట్లు చెప్పాడు. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాద బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించాలని అనుకుంటున్నట్లు లేఖలో స్పష్టంగా చెప్పారు.

అంటే చంద్రబాబు మనస్సంతా గ్యాస్ ప్రమాద బాధితుల చుట్టే ఇంకా తిరుగుతున్నట్లు అర్ధమైపోతోంది. ప్రమాదం జరిగినపుడే వెళ్ళి రాజకీయం చేయాలని అనుకున్నాడు. అందుకనే విచిత్రంగా ప్రధానమంత్రిని పర్మిషన్ అడిగిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే పర్మిషన్ రాకపోయేసరికి ఏమి చేయలేక జూమ్, ట్విట్టర్ ద్వారానే జగన్ పై బురద చల్లిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా అదే విషయాన్ని కెలికి మళ్ళీ రాజకీయం చేద్దామనే ప్లాన్లో ఉన్నట్లున్నాడు. అందుకనే హైదరాబాద్ నుండి వైజాగ్ కు విమానంలో వెళ్ళి తిరిగి గుంటూరుకు రోడ్డు మార్గంలో వస్తానని డిజిపికి రాసిన లేఖలో స్పష్టం చేశాడు.

డిజిపికి రాసిన లేఖలో తన పర్యటన విషయాన్ని మాత్రమే ప్రస్తావించాడు చంద్రబాబు. మరి కొడుకు ఏమి చేయబోతున్నాడో మాత్రం చెప్పలేదు. అంటే లేఖలోని అంశాల ప్రకారమైతే ఏపిలోకి చంద్రబాబు మాత్రమే అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు అర్ధమవుతోంది. చంద్రబాబు ఏపిలోకి వచ్చేసిన తర్వాత కూడా లోకేష్ హైదరాబాద్ లోనే కూర్చుని ఏమి చేస్తాడు ?