iDreamPost
android-app
ios-app

పంచాయితీ ఎన్నికలకు మానిఫెస్టో నా ?ఇదేమి విడ్డూరం బాబు…

పంచాయితీ ఎన్నికలకు మానిఫెస్టో నా ?ఇదేమి విడ్డూరం బాబు…

గ్రామ స్వరాజ్యం.. గ్రామ ప్రశాంత వాతావరణం కోసం ఎలాంటి రాజకీయాలు లేకుండా.. గ్రామ అభివృద్ధికి అంతా కట్టుబడి ఉండాలని పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాలు, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే ఎన్నికలు నిర్వహిస్తారు. రాజకీయ పార్టీల రంగులు, గుర్తులు కూడా కనిపించకుండా అంతా కలిసి తమ నాయకుడిని ఎన్నుకుంటారు. గ్రామీణ వాతావరణంలో రాజకీయాలు ఎక్కువైతే ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు, అతి సున్నితమైన విషయాలే పెద్ద విషయాలు అవుతాయి. ఈ దృష్టితోనే రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవాలు వైపు మొగ్గు చూపితే గ్రామ అభివృద్ధి చేసుకోవడానికి ఏకగ్రీవ నజరానాలను ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వ ఆశయం ఎంత ఉన్నతంగా ఉంటే ఎప్పుడూ రాజకీయాలు, రాజకీయ కుట్రలతో ముందుండే విపక్ష నేత చంద్రబాబు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కి రాజకీయ రంగు పులమడానికి సిద్ధమైపోయారు. ఏ పార్టీ ఏ నాయకుడు సైతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చేయని… ఓ ఎన్నికల మేనిఫెస్టోను తయారుచేసి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కు సిద్ధమయ్యారు.

అబద్దాలు.. ఆడంబరాలు!

ఎన్నికల హామీ… ఈ మాటకు, చంద్రబాబు తీరుకు నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా కనిపిస్తుంది. అధికారం చేజిక్కించుకోవడానికి పేజీలకు పేజీలు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రకరకాల కల్లబొల్లి మాటలు చెప్పి వాటిని కచ్చితంగా నిజం చేస్తానంటూ ప్రగల్భాలు పలికి… ఎన్నికలు అయిపోయిన తర్వాత… తనకు కావలసిన అధికార పీఠం చేజిక్కిన తర్వాత కనీసం హామీలు కాదు కదా… ఎన్నికల వేళ అది చేస్తాం ఇది చేస్తాం అంటూ మాయమాటలు చెప్పి ముద్రించిన మేనిఫెస్టోను సైతం అధికారిక పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించిన గొప్ప ఘనత చంద్రబాబుది.. అలాంటి చంద్రబాబు ఇప్పుడు పార్టీరహితంగా సాగే పంచాయతీ ఎన్నికల్లో టిడిపి తరఫున రెండు పేజీల మేనిఫెస్టోను విడుదల చేసి… దానిలో సైతం నవ్వులపాలు అయ్యే హామీలు గుప్పించడం ఆయనకే చెల్లింది.

పల్లె ప్రగతికి పంచ సూత్రాలట!

అన్ని విషయాలను కాపీ కొట్టి దానికి పసుపు రంగు పూసి అలవాటు ఉన్న చంద్రబాబు గ్రామ మేనిఫెస్టో అంటూ రెండు పేజీలు విడుదలకు సైతం మళ్ళీ వైఎస్ఆర్ సిపి నవరత్నాలు కాన్సెప్ట్ ని కాపీ కొట్టినట్లు కనిపించింది. పల్లె ప్రగతి కి పంచరత్నాలు అంటూ 5 విషయాలను ఆయన ప్రస్తావించిన తీరు… పూర్తిగా చంద్రబాబు మానసిక స్థితిని తెలియజేస్తుంది. అసలు పార్టీలతో సంబంధం లేకుండా ఎలాంటి గుర్తులు లేకుండా సాగే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు. దీనికి టిడిపి మేనిఫెస్టోకు సంబంధం ఏమిటి? పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ప్రోత్సహించడం అంటే అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే కదా? ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో సైతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన నిర్ణయాలను గ్రామపంచాయతీలు తీసుకుంటాయి అన్నట్లు దానిలో పొందుపరచడం చూస్తుంటే అసలు చంద్రబాబు బుర్ర పని చేస్తుందా?? లేక మరో మోసానికి ఆయన సిద్ధమయ్యారా? గ్రామీణ ప్రజలను వెర్రి వాళ్ళని చేయడానికి చూస్తున్నారా అనే అనుమానం కలగక మానదు.

కరోనా టీకా పంచాయతీ వేస్తుందా?

తెలుగుదేశం మేనిఫెస్టో లో తమ అభ్యర్థులను గెలిపిస్తే.. పంచాయతీలో సాధికార సర్వే పూర్తి స్థాయిలో నిర్వహించి అందరికీ కరోనా టీకాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసలు సాధికార సర్వే చేయాల్సింది ఎవరు? టిడిపి కార్యకర్తలు చేస్తారా? పంచాయతీ దీనికి ప్రత్యేకమైన సిబ్బందిని నియమించుకుని వారికి జీతాలు ఇస్తుందా? సాధికార సర్వే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది కదా? సాధికార సర్వే నిర్వహించి కేకలు ఇవ్వడం అనే పదం ఎందుకు తెలుగుదేశం ఉపయోగించింది?? అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కదా?? దీంతోపాటు సమగ్ర సర్వే చేసి ప్రభుత్వ పథకాలన్నీ టీడీపీ నుంచి గెలిచిన పంచాయితీ సర్పంచులు అందిస్తారు అంట… ఇదేలా సాధ్యం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా వాలంటరీ వ్యవస్థ… గ్రామ సచివాలయం వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇవే కదా ఆ బాధ్యతలను చూడాల్సింది.. మరి తెలుగుదేశం పార్టీ బలపరిచిన వారు ఎలా చేస్తారు.. ఆ మాత్రం బుర్ర చంద్రబాబు కు లేదా అనేది ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న.

మోదీని అడగలేరు!

విద్యుత్ సంస్కరణలు పై ఎంతో వేగంగా వెళుతున్న కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో కూడా విద్యుత్తు పంపుసెట్లకు నీటి మీటర్లు బిగించిచాలని భావిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ మాత్రం చంద్రబాబు తన మద్దతుదారులతో పంచాయతీలో తీర్మానాలు చేపిస్తారట. ఈ తీర్మానం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏమైనా దిగి వస్తుందా?? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచబ్యాంకు అడుగులకు మడుగులొత్తే ఇలాంటి సంస్కరణలకు ఆయనే కదా పెద్దపీట వేసింది… ఈ పాపంలో చంద్రబాబుకు ఎంతో భాగం ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వం తో పోరాడాల్సింది.. మోడీతో దెబ్బలు ఆడాల్సిన చంద్రబాబు పంచాయతీల్లో తీర్మానాలు చేపించి దీనిని అడ్డుకోవాలి అనుకోవడం ఆయన ఆలోచన శక్తి క్షీణిస్తుంది అని సంకేతం ఇస్తున్నట్లు కనిపిస్తుంది.

విద్య నీకేం సంబంధం??

పంచాయతీల్లో బాలిక విద్య మీద ఆడ పిల్లలను బడికి పంపించడం మీద పంచాయతీల్లో ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తారు అట. తాము బలపరిచిన అభ్యర్థులు గెలిచిన చోట ఈ బాలిక విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెడతారట… విద్య విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వం. అసలు బాలికా విద్యకు విద్య విషయంలో సంస్కరణలు తీసుకు రావాల్సిన బాధ్యతలు పంచాయతీ మీద ఉన్నాయా? ఒకవేళ వారు అనుకుని ఎలాంటి సంస్కరణలు అయినా తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లతో మాట్లాడకుండా ఇష్టానుసారం సంస్కరణలు ప్రవేశ పెట్టవచ్ఛా?? అసలు పంచాయతీలకు సంబంధం లేని అంశాలను మేనిఫెస్టో అంటూ రెండు పేజీలు విడుదల చేసి రెండు గంటలకు పైగా జూన్ సమావేశం నిర్వహించడం చంద్రబాబుకే సాధ్యం.. ముందుగా ఈ అంశాలన్నీ మాట్లాడుకునే కన్నా చంద్రబాబు మానసిక పరిస్థితి ఎలా తయారవుతుంది…?? ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఏమౌతుంది..? ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం సరిగా ఉందా అనే అనుమానాలు సైతం ఇప్పుడు ఈ మేనిఫెస్టో ద్వారా వ్యక్తం అవుతున్నాయి.