iDreamPost
android-app
ios-app

అందుకే చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నారా..?

అందుకే చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నారా..?

పేద‌ల ఏళ్ల నాటి క‌ల‌ను సాకారం చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇళ్ల స్థ‌లాల పంపిణీకి చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తోంది. కోర్టు కేసులు.. ఇత‌ర కార‌ణాలు ఎలా ఉన్నా వాట‌న్నింటినీ ప‌రిష్క‌రించుకొని పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు అంద‌జేసేందుకు త‌న ప‌ని మాత్రం కొన‌సాగిస్తోంది. దీని ద్వారా 30 ల‌క్ష‌ల మందికి పైగా పేద‌లు ల‌బ్దిపొంద‌నున్నారు. పట్టాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ప్ర‌తిప‌క్షాల కుట్రతో అడుగ‌డుగునా అడ్డంకులు త‌గులుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే నాలుగు సార్లు కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. ఆ కార్య‌క్ర‌మం జ‌రిగితే ప్ర‌జ‌ల దృష్టితో జ‌గ‌న్ దేవుడిలా నిలిచిపోతారు. అందువ‌ల్లే చంద్ర‌బాబు దానికి అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఆ దూకుడు క‌ళ్లెం వేయ‌లేక‌…

జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో దూకుడును ప్ర‌దర్శిస్తోంది. మ్యానిఫెస్టోలో పొందుప‌రిచిన హామీలు.. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను అన్నింటినీ నెర‌వేర్చుకుంటూ పోతోంది. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా.. ఆర్థిక ఇబ్బందులున్నా వెన‌క‌డుగు వేయ‌డం లేదు. ఆర్థిక నిపుణుల‌కూ కూడా అంద‌ని వ్యూహాత్మ‌కంగా ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంది. కుల‌, మ‌త‌, పార్టీ, వ‌ర్గ బేధాలు లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ప‌థ‌కం కింద ల‌బ్ది చేకూరేలా ప‌ని చేస్తోంది. ఇప్ప‌టికే వేల కోట్ల రూపాయ‌ల‌ను నేరుగా ప్ర‌జ‌ల ఖాతాల్లో జ‌మ చేసింది. జ‌గ‌న్ దూకుడు కు క‌ళ్లెం వేయ‌లేక ప్ర‌తిప‌క్షాల‌కు మ‌తి పోతోంది. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త తెచ్చేందుకు చంద్ర‌బాబు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌ను అంద‌రూ స్వాగ‌తిస్తున్నారు. అందువ‌ల్ల ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు. అందుకే ఇళ్ల స్థ‌లాల పంపిణీ కార్య‌క్ర‌మానికి అడ్డంకులు సృష్టిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్న జ‌గ‌న్

వైఎస్సార్‌ హౌసింగ్‌ స్కీమ్‌ కింద నిర్మించిన మోడల్‌ హౌస్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. తాడేపల్లి బోట్‌ హౌస్‌ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్‌ హౌస్‌ను నిర్మించింది. సెంటు స్థలంలో తక్కువ ఖర్చుతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సౌకర్యవంతంగా నిర్మాణం చేసింది. 40 గజాల విస్తీర్ణంలో హాల్, బెడ్‌రూమ్, కిచెన్, వరండాలతో కూడిన ఈ నిర్మాణానికి 2లక్షల 50వేల రూపాయలు ఖర్చు అయింది. అత్యంత తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. దీంతో పాటు నిర్మాణాలు చేప‌ట్టేందుకు స‌న్నాహాలు చేస్తోంది.