iDreamPost
iDreamPost
ఓ కాంపిటీషన్‌లో పెర్‌ఫార్మ్‌చేసిన హీరోయిన్‌ను ఉద్దేశించి ‘‘నిన్ను ఎక్కడో పెడదామనుకుంటాను.. కానీ నువ్వు అక్కడకు రావు.. ఇక్కడే ఉంటానంటావు’’ అంటూ బ్రహ్మానందం త్రిషను అనడం ఇంకా యూ ట్యూబ్ ఛానల్‌లో కామెడీ ట్రాక్‌గా మనకు కన్పిస్తూనే ఉంటుంది.
పాపం పచ్చబ్యాచ్ పెదబాబును ఎక్కడో పెట్టాలనుకుంటుంది.. కానీ ఆయన మాత్రం అక్కడకు రాడు. వెనకటికి ఏదో టైమ్ కలిసొచ్చి ఆస్థాయికి చేరాడుగానీ, లేకపోతే అంతసీన్‌లేదనేది ఇప్పటి అధికారపక్షం వాదన. ఏది ఏమైనా పెదబాబులాంటి ఫార్టీ టు ఇయర్స్ ఇండస్ట్రీ మాట్లాడే కొన్ని మాటలు సామాన్య జనానికి కూడా ఒళ్ళుమంట తెప్పిస్తున్నాయనడంలో సందేహం లేదు.
కరోనా విజృంభణ మొదలయ్యాక ప్రభుత్వాలు, వైద్య బృందాలు దీని భారిన పడేవారికి హాస్పటాలిటీ ఎక్కడ కేటాయించాలన్నదానిపైనే దృష్టిపెట్టారు. ఇందుకు బడులు, గుడులు, కళ్యాణ మండపాలు తదితర అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. జూలై–సెప్టెంబరు నెలల నాటికి భారీగా కేసులు నమోదైతే అందుకు అనుగుణంగా ఏ ఊరికావూరిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు కూడా సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రెడీ చేసారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లోని జనాభాను బట్టి ఎంత మంది ఇన్ఫెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందో అంచనా వేసి, అందుకు తగిన విధంగా బెడ్‌లు సిద్ధం చేసేందుకు సర్వం సమాయత్తపరిచారు. అందులో భాగంగా పెదబాబు హయాంలో అంతంత మాత్రంగానే కట్టించిన ఇళ్ళను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. అక్కడ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసి నివాసిత ప్రాంతాల్లోని వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్భంధీగా ఏర్పాట్లు చేసారు.
అయితే ఘనత వహించిన పెదబాబు మాత్రం మనుష్యుల సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ జనానికి ఒళ్ళుమంట తెస్తున్నారు. తన హయాంలో పేదలకు సిద్ధం చేసిన ఇళ్ళను కోవిడ్ సెంటర్లుగా చేసారని పాపం తన ఆక్రోసాన్ని వెళ్ళగక్కేసారు. పెదబాబు సీయం హోదా వెలగబెట్టినప్పుడు కేంద్రం నిధులు బొక్కేసి అక్కడ ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయలేదని బీజేపీ నాయకులు ఒక పక్క విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. అయినాగానీ వాటిని పక్కనపెట్టి జనం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు తన ఫార్టీ టు ఇయర్స్ అనుభవాన్ని వినియోగించడం జాలిపడాల్సిన అంశమే.
పలువురు సెలబ్రిటీలు తమ భవనాలను కరోనా వైరస్ భారిన పడిన వారికి వైద్య సదుపాయం అందించేందుకు వినియోగించుకోవాలని కోరుతూ ముందు వచ్చారు. తద్వారా జనంలో నెలకొన్ని భయాలను పారద్రోలేందుకు కృషి చేస్తున్నారు. అంతే కాకుండా మాకూ వచ్చింది, ఎవరికైనా రావొచ్చు. ముందుగా జాగ్రత్తపడడండి, ఒక వేళ ఎవరికైనా వైరస్ సంక్రమిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి అంటూ జనంలో అవగాహన పెంచేందుకు తోడ్పడుతున్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలను మాత్రం పెదబాబు రెచ్చగొట్టే ప్రయత్నాలో తలమునకలై ఉండడం ఆయన మానసిక స్థితిమీద జాలిపడాల్సిన అంశమేనన్నది పలువురి రాజకీయ పరిశీలకుల భావన. రాష్ట్ర ప్రజల బాగుకోసం నిర్మాణాత్మకమైన సలహాల్వివ్వవయ్యా ‘బాబూ..’ అంటే వారిని రెచ్చగొట్టేలా ప్రయత్నం చేయడాన్ని ప్రజలు గమనించకమానరు.