iDreamPost
iDreamPost
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం శాసన సభ్యుడు అచ్చం నాయుడుని నేటి ఉదయం ఏసీబీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 155 కోట్ల రూపాయల మేర భారీ అవినీతికి పాల్పడిన ఈ కేసుని తెలుగుదేశం నేతలు ఎప్పటిలాగే కులం చుట్టు ప్రాంతం చుట్టు తిప్పి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. తమ పార్టీ సభ్యుడైన అచ్చం నాయుడు అవినీతికి పాల్పడలేదని ఆ పార్టీ నేతలే ఎవ్వరు చెప్పలేకపోగా అనారోగ్యం మనిషిని అరెస్టు చేస్తారా, బలహీన వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి అంటు కేసుకు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ పరోక్షంగా తప్పుని ఒప్పుకున్నట్టు అయింది.
అయితే ఈ కేసులో తెలుగుదేశానికి రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీల నుండి మద్దతు రాకపోగా దాదాపు అన్నీ పార్టీలు ప్రభుత్వ చర్యను సమర్ధిస్తూ ప్రకటనలు చేయడం గమనార్హం. ఉదయం బిజేపి నేతలు కన్నా లక్ష్మీ నారాయణ , జీవియల్ నరసింహారావు, పైడిపాల మాణిక్యాలరావు ఈఎస్‌ఐ స్కాంలో జరిగిన అరెస్టులను సమర్ధిస్తు ప్రకటనలు చేయగా ఇక సాయంత్రానికి సి.పి.ఎం పార్టీ మధు కూడా అరెస్టుని సమర్ధిస్తు ప్రకటన విడుదల చేశారు. తాను గతంలోనే స్కాం జరిగిందని చెప్పానని, ఆ మేరకు లేఖను కూడా రాసానని, ఈ స్కాం లో ప్రమేయం ఉన్న ఎవ్వరిని వదలడానికి వీలేదని, అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు సరిగా లేదని అవినీతి కేసులో కులం ప్రాంతం ప్రస్తావన ఏంటని ప్రశ్నిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు స్కాం విషయంలో అచ్చం నాయుడు అరెస్టుని సమర్ధిస్తే బి.జే.పి తో పొత్తులో ఉన్న ఒక్క జనసేన మాత్రం ఈ అరెస్టు అవినీతికి పాల్పడినందుకా లేక కక్షసాదింపా అంటూ పొంతనలేని ప్రకటన ఒకటి విడుదల చేసింది. ఏది ఏమైనా పూర్తిస్థాయిలో జరిగిన దర్యాప్తు తరువాత అధికారులు ఈ స్కాం విషయాన్ని ఆదారాలతో వెళ్ళడించేసరికి అన్నీ పార్టీలు తెలుగుదేశానికి దూరంగా జరిగినట్టు కనిపిస్తుంది. దీంతో ఆ పార్టీకి దాదాపుగా ఒంటరైందనే చెప్పాలి