iDreamPost
android-app
ios-app

Chandrababu Naidu, DGP, SEC – అవును, చేతకాకపోతే రాజీనామా చేయాలి.. మరి మీరో బాబూ..?

  • Published Nov 10, 2021 | 7:55 AM Updated Updated Nov 10, 2021 | 7:55 AM
Chandrababu Naidu, DGP, SEC –  అవును, చేతకాకపోతే రాజీనామా చేయాలి.. మరి  మీరో బాబూ..?

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నాయకుల అరాచకాలను అడ్డుకోవడం చేతకాకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక పార్టీని నడపడం చేతకాని తానెందుకు రాజకీయాల నుంచి వెళ్లిపోవడం లేదు. కుప్పం స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. నామినేషన్లు వేయకుండా దారికాచి అడ్డుకున్నారని, ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు.

చీటికీమాటికీ అధికారులను ఆడిపోసుకొనే బాబు ఇటీవల వారిపై మరీ విరుచుపడిపోతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్ గా మార్చేశారు. కంట్రోల్ చేయడం చేతకాని డీజీపీ రాజీనామా చేయాలని నిన్నటి వరకు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం చేతకాకపోతే ఎస్ఈసీ రాజీనామా చేయాలంటున్నారు. మీరు చెప్పినట్టు అధికారులు పనిచేయకపోతే చేతకానివారి కింద లెక్క వేస్తారా?

వారి పనితీరుకు మీ సర్టిఫికెట్ అవసరమా..

రాష్ట్రంలో గంజాయి సాగును, రవాణాను అరికట్టేందుకు ఆపరేషన్ పరివర్తన్ అమలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతకానివారా? మతాన్ని, కులాన్ని అడ్డుపెట్టుకుని మీరు గత కొన్ని నెలలుగా చేస్తున్న కవ్వింపు రాజకీయాల వల్ల శాంతి భద్రతలు దిగజారకుండా కాపాడుతున్న ఆయన ఆధ్వర్యంలోని పోలీసు శాఖ చేతకానిదా? మీరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా, దూషించినా సంయమనం కోల్పోకుండా స్థానిక, మునిసిపల్, పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఎస్ఈసీ నీలంసాహ్నీ చేతకానివారా? దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రవ్యాప్తంగా డోర్ డెలివరీ చేస్తున్న అధికార యంత్రాంగం చేతకానిదా? మీ రాజకీయ ప్రయోజనాల కోసం నోరు ఎటు తిరిగితే అటు మాట్లాడేస్తారా? ఉన్నత అధికారులకు రాజకీయ దురుద్దేశాలు అంటగట్టి విమర్శలు గుప్పించడమే కాక మీ అంతు చూస్తాం. మేం అధికారంలోకి వచ్చాక మీరు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టం అంటూ తరచు వారిని బ్లాక్ మెయిల్ చేస్తే మీకు భయపడతారను కుంటున్నారా? 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన పద్దతేనా ఇది? ఉద్యోగులు పబ్లిక్ సర్వెంట్లు.. వారు మీ బానిసలు కారు. వారు ఎలాగూ తిరిగి సమాధానం చెప్పరు కదా అని ఇష్టానుసారం మాట్లాడటం భావ్యమా?

Also Read  : MLC Elections TDP – ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరం ?

మీరు రాజీనామా చేయలేదేమి?

తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయం పాలైన 2019 ఎన్నికల అనంతరం మీరెందుకు పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాలు వదిలిపోలేదు? మీ కుమారుడు లోకేశ్ కేబినెట్ మంత్రిగా మూడు శాఖలు నిర్వహిస్తూ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవికి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? తెలుగుదేశం పార్టీని చేతుల్లోకి తీసుకుంది మొదలు ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పొత్తులు లేకుండా టీడీపీని గెలిపించలేకపోయినా మీరు ఎందుకు ఇంకా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు? అసలు పార్టీ లేదు.. దానికి భవిష్యత్తు లేదూ అని మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీకి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతారు కాని ఉద్యోగులు పనిచేయకూడదా?

ఓడిపోతామనేనా ఈ ఫ్రస్టేషన్..

తన కంచుకోటగా భావిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలోని మునిసిపల్ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటనే ఫ్రస్టేషన్ తోనే చంద్రబాబు మీడియా ముందు ఆక్రోశిస్తున్నారనే అభిప్రాయం పరిశీలకులకు కలుగుతోంది. రోజూ కుప్పం ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని క్లోజ్ గా మానిటర్ చేస్తున్న చంద్రబాబుకు భవిష్యత్తు అర్థం కావడంతోనే బురద జల్లుడు రాజకీయం తీవ్రతను పెంచేస్తున్నారని అనుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని, తమపైనే దాడులు చేస్తూ.. తిరిగి కేసులు పెడుతున్నారు అని బాబు చేస్తున్న ఆరోపణలు జనాన్ని తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నవని భావిస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీని గెలుచుకోవడానికి బాబు ఇంతగా అవస్థలు పడడాన్ని బట్టే పార్టీ పరిస్థితి అర్థం అవుతోంది.

Also Read : Social Media TDP -చంద్రబాబుకు సోష‌ల్ మీడియా సెగ

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş