Idream media
Idream media
చంద్రబాబు నాయుడు పరిచయం అక్కర్లేని పేరు..రాష్ట్రవ్యాప్తంగా,దేశవ్యాప్తంగా టీడిపిని నడిపించిన గొప్ప నాయకుడు..అది గతం ప్రస్తుతం టీడిపి పార్టీ ఆంద్రప్రదేశ్ లో ఉనికి కోసమే పోరాడుతున్న పరిస్థితి..కేవలం అసెంబ్లీ ఎన్నికలలో 23 సీట్లు మాత్రమే గెలిచి ఘోరంగా విఫలమైన పార్టీ..ఒక వైపు ముఖ్య నాయకులందరు ఒక్కరొక్కరే పార్టీని వీడుతుండటంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు..
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడని ఆరోపిస్తు 2005లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఏసీబీ స్పెషల్ కోర్టులో ఫిర్యాదు చేశారు..చంద్రబాబు దీనిపై ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తే,అప్పట్లో ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది..తర్వాత చంద్రబాబు నాయుడు హైకోర్ట్ కు వెళ్లితే ఆయన పిటిషన్ పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో విచారనకు సంబందించి తదుపరి చర్యలు నిలిపేస్తు 2005లోనే స్టే విధించారు..ఈ స్టే ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచీ ఈ కేసులో స్టే కొనసాగుతు వస్తుంది.గత ఏడాది సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు అక్రమాస్తుల కేసు పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది.. స్టే మీద ఎటువంటి పొడిగింపు లేకపోవడంతో విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు జడ్జి ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. కేసు వేసిన లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని సూచిస్తూ కేసును నవంబర్ 25 వ తేదీకి వాయిదా వేశారు.అయితే కొన్ని అనివార్యకారణాల వలన జడ్జిలు అందుబాటులో లేకపోవడంతో అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6కు వాయిదా వేస్తునట్టు ఏసీబీ కోర్టు తెలిపింది..ఆస్తులకు మించి సంపాందించిన కేసులో డిసెంబర్ 6 న న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో అని రాజకీయ వర్గాలు ఆదృతగా ఎదురుచూస్తున్నాయి..