Idream media
Idream media
2015లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కు డబ్బులను ఎర చూపి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి అప్పట్లో అరెస్ట్ అయిన విషయం కూడా తెలిసిందే. దీనికి సంబంధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. స్టీఫెన్ కు రేవంత్ ఇచ్చేందుకు ప్రయత్నించిన కోట్ల రూపాయలు ఎక్కడివి అనే దానిపై ఇప్పటికీ ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే రేవంత్ ఓటుకు నోటు కు తెర తీశారని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథయంలోనే చంద్రబాబు పేరును చార్జిషీట్ లో ప్రస్తావించారు కూడా. ఇప్పుడు తాజాగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ తో మరోసారి ఆ కేసు సంచలనంగా మారుతోంది. ఇప్పటి వరకూ 37 సార్లు తప్పించుకున్న చంద్రబాబుకు ఈసారి ఉచ్చు తప్పేలా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసు పూర్వాపరాలిలా..
‘2017 మార్చిలో పిటిషన్ దాఖలు చేయగా 2018 నవంబరులో పిటిషన్ ధర్మాసనం ముందుకొచ్చింది. నాడు జస్టిస్ మదన్ బి లోకూర్ ధర్మాసనం ముందుకు రాగా 2019 ఫిబ్రవరిలో విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. 2019లో విచారణ చేయాల్సిన కేసు నెలలు గడుస్తున్నా బెంచ్‌మీదకు రాకపోవడంతో నవంబర్ 23, 2019న మరొక ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ దాఖలు చేశాం. అయినప్పటికీ విచారణ జాబితాలోకి రాకపోవడంతో ఈ నెల మొదటి వారంలో మరో డైరెక్షన్ అప్లికేషన్ దాఖలు చేశాం’ అని ధర్మాసనానికి వివరించారు. పిటిషన్ వచ్చే ఏడాది వేసవి సెలవులు అనంతరం జులైలో విచారణ చేస్తామని జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే పేర్కొన్నారు. వచ్చే ఏడాది జులైలో విచారణకు ఏమీ అభ్యంతరం లేదని కానీ విచారణ తేదీని ఖరారు చేయాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. ఇప్పటి వరకూ తప్పించుకున్న చంద్రబాబుకు ఈకేసు ఈసారి శిక్ష తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిటిషనర్ తరఫు వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, న్యాయవాది అల్లంకి రమేశ్ ఈ మేరకు ఆధారాల సేకరణలో ఉన్నారు.