iDreamPost
android-app
ios-app

త్వ‌ర‌లోనే మూడు రాజ‌ధానులు.. కేంద్రం సంకేతాలు?

త్వ‌ర‌లోనే మూడు రాజ‌ధానులు.. కేంద్రం సంకేతాలు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మూడు రాజ‌ధానుల‌కు కేంద్రం ఆమోద ముద్ర వేసిన‌ట్లేనా? కర్నూలుకు హైకోర్టు తరలింపు కోసం తొందరలోనే రీ నోటిఫికేషన్ జారీ చేయ‌నుందా? అంటే అవున‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని, సెక్షన్ 13 ప్రకారం రాజధాని ఆంటే ఒకటికే పరిమితం కావాలని కాదని గ‌తంలో హైకోర్టుకు కేంద్రం దాఖ‌లు చేసిన‌ అదనపు అఫిడవిట్ లో పేర్కొంది.

2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందన్న కేంద్రం.. హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని తెలిపింది. రాజధానికి కేంద్రం ఆర్థిక సహాయం మాత్రమే చేస్తుందని.. రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ మూడు రాజ‌ధానుల‌పై మ‌రో సారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజ‌ధానులను ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌నం సృష్టించారు. అప్ప‌టి నుంచీ ఏపీ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది.

Also Read:హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎల్.రమణ..?

ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో జరుగుతున్న కొన్ని పరిణామాలని క్షుణ్ణంగా పరిశీలిస్తే జగన్ ప్రభుత్వం చెప్పినట్టు మూడు రాజధానులకి కేంద్రం కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. రాజధాని వ్యవహారంపై ఒకవైపు హైకోర్టులో కేసులు గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వమే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజధాని ఏది ఏపీలో పేదలకోసం ఎన్ని ఇళ్లు కట్టారు రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఎంత మంజూరు చేశారు ఏపీలో స్మార్ట్సిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారు ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా? అంటూ హైదరాబాద్కు చెందిన చైతన్యకుమార్ రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కేంద్రం దాదాపుగా ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయి అన్నట్టుగానే సమాధానం ఇచ్చింది.

ఇదే ప్రశ్న గతంలో అడిగినప్పుడు ఇది ఆర్టీఐ పరిధిలోకి రాదంటూ సమాధానం ఇచ్చింది. అయితే తానేమీ దేశ రక్షణ రహస్యాలు అడగడం లేదని రాష్ట్ర రాజధాని ఏదో తెలుసుకోవాలనుకుంటున్నానని తనకు సమాధానం ఇవ్వకపోతే కోర్టుకు వెళతానని చైతన్యకుమార్ రెడ్డి స్పష్టం చేయడంతో కేంద్ర హోం శాఖ బుధవారం ఆయనకు సమాధానం పంపించింది. అందులో ఒకటి నుంచి ఐదువరకు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ రాజధాని ఏది మొదలుకొని మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా అన్న ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సమాధానమిచ్చింది. ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణ- అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం తీసుకొచ్చి మూడు రాజధానులను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర రాజధాని నగరం ఏదన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని సమాధానం ఇచ్చింది.

Also Read:దేశ రాజకీయాలను ప్రజ్వలించిన తార జ్యోతిబసు

దీన్ని బట్టి చూస్తే ..కేంద్రం కూడా మూడు రాజధానుల విషయంలో సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మూడు రాజధానులను కేంద్రం గుర్తించగానే ..కర్నూలుకు హైకోర్టు తరలింపు కోసం తొందరలోనే రీ నోటిఫికేషన్ రావటం ఖాయమని స్పష్టం అవుతోంది. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా ఈ మేర‌కు కేంద్ర పెద్ద‌ల వ‌ద్ద ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఆయ‌న కూడా హైకోర్టు తరలింపుకు కేంద్రం రీ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు. నోటిఫికేష‌న్ జారీ కాగానే, పరిపాలనా రాజధాని ని వైజాగ్ కు తరలించడం జ‌రిగిపోతుంది. అమరావతి శాసనరాజధానిగా కొన‌సాగుతుంది. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన స‌మాధానంతో మూడు రాజధానుల ప్రకటన చాలా త్వరగానే వెలువడే అవకాశం లేకపోలేదు.