iDreamPost
android-app
ios-app

పోలవరం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పోలవరం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

జగన్ ప్రభుత్వానికి కేంద్రం తీపి కబురు చెప్పింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో గతంలో పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,177.62 కోట్లకు సంబంధించి లెక్కలు నిర్ధారించి ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఇచ్చిన ఆడిటెడ్‌ నివేదికను కేంద్ర జల్‌ శక్తి, ఆర్థిక శాఖలకు అందజేశారు. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,300 కోట్లను రీయింబర్స్‌మెంట్‌ చేసేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అంగీకరించారు.

బహిరంగ మార్కెట్లో బాండ్ల ద్వారా రుణాలను సేకరించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించనుంది. దీంతో కొద్దిరోజుల్లో 2,300 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందనున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలకోసం గత నెల 25 న ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మంత్రి అనిల్ కుమార్, మరియు వైసీపీ ఎంపీలు కూడా సోమవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ని కలిసి పోలవరం ప్రాజెక్టు నిధులను విడుదల చేయమని కోరడంతో రూ.2,300 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని మిగిలిన నిధులు రూ.1,758.02 కోట్లను మరోసారి ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.