Idream media
Idream media
మొన్న అసెంబ్లీ బయట జరిగిన రభస గురించి చూద్దాం. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లోపలికి రావడానికి నిబంధనల ప్రకారం వేరే ద్వారం వుంటుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు ఆ ద్వారం నుంచే లోపలికి రావాలి. అయితే చంద్రబాబు , ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంకా కొంతమంది కార్యకర్తలతో కలిసి గుంపుగా శాసనసభ్యులు ప్రవేశించాల్సిన గేటుపైకి దండెత్తారు.అక్కడ సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించే మార్షల్స్ వారి డ్యూటీ వాళ్ళు చేయాలి. వారి డ్యూటీ ఏమిటి అంటే సభ్యులను ఒక్కొక్కరిని మాత్రమే లోనికి అనుమతించటం , ప్రవేశ ద్వారం వద్ద గుంపుగా ఎటువంటి ధర్నాలు నిర్వహించకుండా చూడటం. ఇది వారి ఉద్యోగ ధర్మం.
మరి ఇప్పుడు చంద్రబాబు గారు తనవాళ్ళతో గుంపుగా రావడాన్ని అడ్డుకోవడమనేది మార్షల్స్ నిర్వహించాల్సిన బాధ్యత. వాళ్ళు చేసిందీ అదే. ప్రతిపక్ష నేతను వేరే గేటు నుంచి రమ్మనీ , సభ్యులను గుంపుగా కాకుండా ఒక్కొక్కరినీ రమ్మని చెప్పారు. దానికి ప్రతిపక్షం చేసిన రాద్దాంతమే నిన్నటి సంఘటన. లోకేష్ బాబు యూస్ లెస్ ఫెలో అనడము, చంద్రబాబు అరే ఒరే అనడమూ అన్నీ వారి అసహనానికి నిదర్శనమైతే బాస్టర్డ్ అంటూ బూతు పదం వాడటం ఆయన అహంకారానికి పరాకాష్ట. మార్షల్స్ లోనికి రానీయకుండా అడ్డుకున్నప్పుడు వాళ్ళు అక్కడే బయట ధర్నా చేసి నిరసన తెలియజేయొచ్చు. లేదా సభలోనికి ప్రవేశించిన తర్వాత స్పీకర్ గారికి ఫిర్యాదు చేయొచ్చు. తిట్లు తిట్టుకుంటూ , మార్షల్స్ ని తోసుకుంటూ లోపలికి రావడం ఉద్దేశపూర్వకంగానే చేశారు.
బహుశా ఒక గందరగోళ వాతావరణం స్రృష్టించి తమపై దౌర్జన్యం జరిగిందని సానుభూతిని ప్రచారం చేసుకోవాలని వ్యూహం అయ్యిండొచ్చు. ఏదైతేనేం జరిగిన సంఘటనలో మార్షల్స్ తప్పు ఏమీ లేదని వీడియోలలో నిరూపణ అయింది. లోకేష్ బాబు ఒక మార్షల్ గొంతు పట్టుకోవడం కూడా కనిపిస్తోంది. నలభై నిమిషాలు సంవత్సరాల రాజకీయ అనుభవం వుంది అని చెప్పుకునే చంద్రబాబుకు బాస్టర్డ్ అనేది ఎంత పెద్ద చౌకబారు పదమో తెలియదు అనుకోవాలా? ఇటువంటి లేనిపోని అరాచక రాజకీయాలకు తెర లేపి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పనితీరు సరిగా లేకనే ఇలా అస్తవ్యస్తంగా తయారైంది అని చెప్పుకోవడానికి చేస్తున్న కుట్రలా వుంది.
నిజానికి చంద్రబాబు తిట్టుకుంటూ తోసుకుంటూ అసెంబ్లీ లోపలికి వచ్చిన తర్వాత అదే పని చేశాడు. ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాగే వుంటుందని వాఖ్యానించి తను స్రృష్టించిన కృత్రిమ గొడవను ఉపయోగించుకుని స్వార్థ రాజకీయ నాయకునిగా పేరు సార్థకత చేసుకున్నాడు. ఇక అసెంబ్లీలో బుకాయించిన సంగతి అంటారా. అది జన్మతః వచ్చిన లక్షణం.