వల్లభనేని వంశీ టీవీ డిబేట్‌లో రాజేంద్రప్రసాద్‌ని నోటికొచ్చినట్టు తిట్టాడు. సరే డిబేట్లలో తిట్టుకోవడం, కొట్టుకోవడం జనాలకు కొత్తకాదు. రెండురోజుల్లో దీన్ని మించింది ఇంకొకటి వస్తే అందరూ మరిచిపోతారు. వంశీ తిట్టడం కరెక్టే కదా అన్నది ఆఖరున మాట్లాడుకుందాం.
తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య వగైరాలు వంశీ పార్టీ మారడంపై ఆయన గతంలో ఏమన్నారు, ఇప్పుడేమన్నారు అంటూ విమర్శలు కురిపిస్తూ నైతిక విలువలు బోధిస్తున్నారు. నిన్నమొన్న వచ్చిన రామయ్యకి చంద్రబాబు చరిత్ర తెలిసినట్టు లేదు. విలువలు చంద్రబాబు దృష్టిలో వలువలు. రోజుకో జత బట్టలు మార్చినట్టు ఆయన విలువలు మార్చుకోగలరు. కావాలంటే ఉదాహరణలు ఇవే
1) 1983లో పార్టీ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్‌తో పోటీ చేస్తానని, జ్యోతిలక్ష్మి వచ్చినా జనం ఎన్టీఆర్ సభలకి మించి వస్తారని డబ్బా కొట్టిన బాబు, చంద్రగిరిలో ఓడిపోయి మామ పంచన చేరి, తర్వాత ఎన్టీఆర్‌ని శంకర్‌గిరి మాన్యాలు పట్టించారు.
2) ఎన్టీఆర్ బొమ్మపై గెలిచి 1984లో పార్టీ మారితే వాళ్లు ద్రోహులు. అదే ఎన్టీఆర్ బొమ్మపై గెలిచి 1995లో పార్టీ మారితో వాళ్లంతా సమాజ సేవకులు….ఇది బాబు విజన్.
3) కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జెడ్పీ చైర్మన్‌గా పార్టీ ప్రకటించిన అభ్యర్థిని ఓడించిన చరిత్ర చంద్రబాబుది. విధేయత, నైతికత…ఈ రెండూ ఆయన డిక్షనరీలోనే లేవు.
4) జెడ్పీ చైర్మన్ బాలగౌడ్ గుండెపోటుతో ఆస్పత్రిలో ఉంటే ఆయన మీద అవిశ్వాస తీర్మానం (1985) పెట్టించిన మానవతా వాది బాబు.
5) 1994లో తమ్ముడు రామ్మూర్తినాయుడి టికెట్‌కే అడ్డుపడ్డ అన్న ఆయన.
చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయినా సుజనాచౌదరి, సీఎం రమేష్ బీజేపీలో చేరినప్పుడు నోర్మూసుకున్న టీడీపీ నాయకులు ఇప్పుడు వంశీ మీద విమర్శలు చేస్తున్నారెందుకో. సుజనా, సీఎం రమేష్ ఇద్దరూ బాబు కోవర్టులు అయినందువల్లేనా? వైసీపీ నుంచి 23 మందిని చేర్చుకున్నప్పుడు ఈ విలువలన్నీ ఏమయ్యాయో! చంద్రబాబు నుంచి కిందిస్థాయి నాయకుల వరకు విలువల గురించి మాట్లాడే అర్హత లేదు.
లోకేశ్ ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ వంశీలాంటి వారిని చాలా మందిని చూశామన్నారు. నువ్వేం చూశావ్ స్వామీ. పార్టీ జెండాలు మోసీ మోసీ వయస్సు అయిపోయిన వాళ్లున్నారు. మీరు మాత్రం ఎమ్మెల్సీ, మంత్రి అయ్యిపోయారు. ప్రజాక్షేత్రంలో దిగి ఓడిపోయారు. వంశీ మీకంటే సీనియర్. పనిచేసినంత కాలం సిన్సియర్‌గానే చేశారు. ఆయనకి మీరు పాఠాలు నేర్పక్కర్లేదు.
ఇక వంశీ అయ్యప్ప మాల వేసుకుని తిట్టారంటున్నారు. మాల వేసినా, వేసుకోకపోయినా తిట్టడం కరెక్ట్ కాదు. కానీ రాజేంద్రప్రసాద్‌ని తిట్టకుండా ఉండటం కూడా సాధ్యం కాదు. బహుశా వంశీ తాను దీక్షలో ఉన్నానని మరిచిపోయి ఉంటాడు. ఎందుకంటే …
ప్రస్తుతం మానవ సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఎవరిని నమ్మాలో తెలియని స్థితి. ఈ సంక్షోభంలో కూడా అమ్మ, చెల్లి…ఇవ్వన్నీ గాఢమైన బంధాలు. వాళ్లని కూడా నమ్మలేని స్థితికి ఇంకా ఈ సమాజం చేరుకోలేదు.
కానీ బాధ్యత గల ఎమ్మెల్సీగా ఉండి రాజేంద్రప్రసాద్ ఏమన్నాడో తెలుసా…జగన్‌పై దాడి జరిగినా కోడికత్తి కుట్ర విజయమ్మ, షర్మిళమ్మ కలిసి చేయించారట.
సార్, ఇలాంటివన్నీ తిట్టకుండా ఉండడం ఎవరికైనా సాధ్యమా? పాపం వంశీ మంచోడు, తక్కువే తిట్టాడు