iDreamPost
android-app
ios-app

తట్ట మట్టి తీయకుండా డాంబికాలా!..

తట్ట మట్టి తీయకుండా డాంబికాలా!..

మొన్నటి అసెంబ్లీ లో చంద్రబాబు డాంబికం మాటలు…నిజానికి ఎప్పుడో రామారావు గాలేరు-నగరి,హంద్రీ-నీవాలకు శిలాఫలకాలు వేసినా తట్టెడు మట్టి ఎత్తనిది వైశ్రాయ్ కుట్రతో రామారావుని దించి గద్దెనెక్కిన చంద్రబాబే.అంతేనా 1996 లో గండికోట రిజర్వాయర్ కు ఒక శిలాఫలకం వేసినా ఇంతే సంగతులు.2004లో వైస్సార్ వచ్చే వరకు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు,బాబు వేసిన శంకుస్థాపన రాయి మాత్రం శిధిలంకాకుండా ఆడనే ఉంది.

రాజశేఖర్ రెడ్డి రావడంతోనే ఆ రెండు కాల్వల పనులు వేగంగా మొదలయ్యాయి.హంద్రీ-నీవా కాలువ మొదలయ్యేది నందికొట్కూరు సమీపంలోను మల్యాల దగ్గర.ఇది పూర్తిగా లిఫ్ట్ ఇరిగేషన్.

ఇక శ్రీశైలం రిజర్వాయర్ లో 842 అడుగుల దగ్గర ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వచ్చిన నీళ్లు సుమారు 15కి.మీ ప్రయాణించి బనకచర్ల దగ్గర శ్రీశైలం కుడి కాలువ,తెలుగుగంగ,కేసీ ఎస్కేప్ చానల్ కు మరలుతాయి.ఇక్కడే గాలేరు-నగరి ప్రారంభం కూడా. పోతిరెడ్డిపాడు దగ్గర 842 అడుగుల స్థాయి ఉంటే కాలువలో నీళ్లు పారుతాయి. పోతిరెడ్డిపాడు దగ్గర 842 అడుగుల్లో నీళ్లు ఉండాలంటే శ్రీశైలంలో అంతకన్నా ఎక్కువగా కనీసం 854 అడుగులు ఉండాలి. 1996 లో ప్రపంచబ్యాంక్ షరతులకు లోబడి బాబు శ్రీశైలంలో 854 అడుగులుగా ఉండాల్సిన కనీస నీటిమట్టాన్ని జీవో-69 ద్వారా 834 కు తగ్గించాడు.

ఇటు చూస్తే వర్షాలు సకాలంలో కురియవు..ఎగువన కర్నాటక,మహారాష్ట్రల్లో కుంభవృష్టి,ఆకస్మిక వరదలు వస్తే ఆ నీళ్లు శ్రీశైలం చేరే పరిస్థితి..ఆ వరదా తక్కువరోజులే ఉంటుంది..కొన్ని దశాబ్దాలుగా ఎక్కువరోజులు వరద పారింది ఈ ఏడాదే..అయితేనేం వృధాగా సముద్రం పాలయ్యాయి తప్ప రాయలసీమ కు ఉపయోగపదలేదు.

అప్పట్లో వైయస్సార్ 11,000 క్యూసెక్కుల ప్రవాహ సామర్ధ్యం ఉన్న పోతిరెడ్డిపాడును 44,000 కు పెంచాడు.అప్పటి స్వపక్షం హైదరాబాద్ బ్రదర్స్,ప్రతిపక్షం గగ్గోలు పెట్టారు..కానీ వీళ్లు విస్మరించింది …ఆ పోతిరెడ్డి పాడు నుంచి శ్రీశైలం కుడికాలువకు 19 టీయంసీల నికరజలాలు,అప్పటి ఏ.పి,కర్నాటక,మహారాష్ట్రలు ఉమ్మడిగా చెన్నై దాహార్తి తీర్చడానికి ఇచ్చిన 15 టీయంసీలు.అంటే 34 టీఎంసీ ల నికర జలాలు,తక్కిన నీళ్లన్నీ మిగులు జలాలే…ఆ మిగులుతో రాయలసీమలో రెండేళ్లకో మాగాణి పంట వేసుకోవాలనుకున్నా ఏడ్చారు ఈ జనం.

ఇక హంద్రీ-నీవా జలాలను కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనే అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు చేరాయి.
మొన్నటి బాబు పాలనలో చేసిందంతా తూతూ మంత్రమే.

బనకచర్లలో కేసీ ఎస్కేప్ చానల్ ఉందని చెప్పుకున్నాము…దానిద్వారా కుందు నదిలో నీళ్లు పారించి నెల్లూరు జిల్లా సోమశిలకు తీసుకుపోగా ఈ ఏడాది ఆ సోమశిలా నిండి నీళ్లు సముద్రం పాలయ్యాయి…

ఇక కృష్ణా ప్రధాన ఉప నది,కర్నూలు,కడపలను సస్యశ్యామలం చేసే కేసీ కాలువకు మూలం అయిన తుంగభద్రకు తగిన క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమలో ఉన్నా..పెన్నార్ బేసిన్ అనే వాదన తెస్తారు..నిజానికి తుంగభద్ర జలాలూ వృధా అవుతుంటాయి.
——————-


ఈ ఏడాది నీటి వృధా చూసి ముఖ్యమంత్రి జగన్ పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 80,000 క్యూసెక్స్ చేస్తా అంటున్నారు..
ఇప్పుడు భజన పత్రికల ఏడ్పు మళ్లీ మొదలు..దానికి తగ్గ కాలువలసామర్ధ్యం ఉందా?రిజర్వాయర్స్ ఉన్నాయా అని?
ఉండొచ్చు,ఉండకపోవచ్చు..

—కానీ మనసుంటే మార్గం లేదా?కాలువల సామర్ధ్యం పెంచమని జగన్ ఇచ్చిన ఆదేశాలు వీళ్లకు కనపడలేదు. 

గాలేరు-నగరి మీదున్న గండికోట సామర్ధ్యం ముందురోజుల్లో చాలా తక్కువ ఉండేది.దాన్ని వైయస్సార్ 26 టీయంసీలకు పెంచాడు.అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఇతర రిజర్వాయర్స్ చేరుతాయి…పులివెందుల సమీపంలోని పైడిపాలెం రిజర్వాయర్ నూ శరవేగంగా పూర్తి చేసారు..మొత్తం 690 కోట్ల ఈ రిజర్వాయర్ కు వైయస్సార్ హయాం లో 667 కోట్లు ఖర్చు చేయగా ఆ తర్వాత బాబు 23 కోట్లు ఖర్చు చేసి ప్రారంభిస్తూ సతీష్ రెడ్డి గడ్డం గీకించాడు,దివాకర్ రెడ్డి తో జొల్లుమాటలు అనిపించాడు.(ఈ జొల్లుమాటలు అదివరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పధకం ప్రారంభసమయంలోనూ అన్నారు).

ఇక అనంతపురం,కడప జిల్లాలకు నీరందించే చిత్రావతి రిజర్వాయర్ నూ 4 నుంచి 10 టీయంసీల సామర్ధ్యానికి పెంచారు.

—-వైయస్సార్ సాహసోపేతమైన పనులు,నిర్ణయాలు చూసిన జనం వారి వారసుడు ఆయన బాటలోనే నడిచి తాగు,సాగు నీటి కష్టాలు తీరుస్తాడని నమ్మి అఖంద మెజారిటీ కట్టబెట్టారు.

—————-

గంపెడు మన్ను ఎత్తిపోయని బాబు హంద్రీ-నీవా వెడల్పు అంటూ తన బినామీ సీయం.రమేష్ కు 1000 కోట్ల పనులు అప్పజెప్పాడు.

ఆరోజే ప్రశ్నించా అక్కడ ఉన్న పంపులలో ఎన్ని ఆపరేట్ చేస్తున్నారు?పట్టిసీమ కోసం తీసుకెళ్లిన పంపును తిరిగి ఎందుకు ఆపరేషన్ లోకి తీసుకురాలేదు?ఇంతా చేసి కాలువ వెడల్పు పనులు మొదలు పెట్టలేదు.

పోతిరెడ్డిపాడులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నీటి సామర్ధ్యం కొలిచే టెలిమెట్రీ యంత్రాలు పెట్టారు…మిగులు జలాలే వాడుకునేప్పుడు,వాటిని దాచుకునే వ్యవస్థగా రిజర్వాయర్స్ కట్టుకుంటే ఎవరికి మాత్రం ఏం బాధ?

Written By — Gopireddy Srinivasa Reddy