iDreamPost
android-app
ios-app

కుల సమరంగా సాగర్ సమరం

కుల సమరంగా సాగర్ సమరం

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక్కడ ఇక్కడ గెలుపోటములు కుల రాజకీయాల పై ఆధారపడడం తో అన్ని రాజకీయ పార్టీలు కులాలపై దృష్టి సారించాయి.

మొన్నటి ఎంఎల్ సి ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్ఎస్ ఇప్పుడు దూకుడుగా ఉంది. ఇప్పుడు అదే పంధాలో సాగర్ ఎన్నికల్లో కూడ విజయం సాధించాలని ఎత్తుగడలు వేస్తోంది. దుబ్బాక, జి ఎచ్ ఎం సి ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఎల్ సి ఫలితాలు టిఆర్ ఎస్‌ కు చాలా బూస్టింగ్ ఇచ్చాయి అయినప్పటికీ, సాగర్ ఎన్నికలో గెలువడం ఆ పార్టీకి ఎంతో అవసరం అనే చెప్పాలి. రాష్ర్టంలో బిజెపి కి పట్టు లేదని ఎంఎల్ సి ఎన్నికలతో అధికార టిఆర్ ఎస్ నిరూపించగలిగింది. సాగర్ లో కూడ అదే రిపీట్‌ చేయాలని టిఆర్ఎస్ భావిస్తోంది. దీనికోసం అనుసరిస్తున్న వ్యూహమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎంఎల్ సి ఎన్నికల్లో గెలవడానికి కులాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది టియ్యారెస్‌. ఆయా ప్రాంతాల్లో కులాల వారీగా విందు భోజనాలు పెట్టింది. వాటికి ఆయా కులాల నేతలు నాయకత్వం వహించారు. టిఆర్ఎస్ లో ఉన్న కుల నేతలను రంగ ప్రవేశం చేయించి విందు భోజనాలను సక్సెస్ చేయించారు. మీకు అండగా మేం ఉన్నాం, మీరు మాకు అండగా ఉండండి అంటూ కుల నేతలు, మంత్రులు సైతం కుల నాయకులుగా అవతారం ఎత్తిన పరిస్థితి ఎంఎల్‌ సీ ఎన్నికల సమయంలో కనిపించింది. ఇప్పుడు సాగర్ ఎన్నికల్లో కూడ అదే ఫార్ములా ను అనుసరిస్తున్నారంట. కులాల వారీగా మంత్రులను, ఎంఎల్ఎ లను రంగ ప్రవేశం చేయించారు. ముగ్గురు మంత్రులను సాగర్‌లో రంగ ప్రవేశం చేశారు. మండలానికి ఇద్దరు ఎంఎల్ఎ లు ఉంటే.. అందులో ఒక ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. మరో ఎమ్మెల్యే ఆ మండలంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఎంఎల్ఎ కు ఇన్ చార్జిగా ఇచ్చారు.

Also Read : నాగార్జునసాగర్‌ : 75 వర్సెస్‌ 36 ..!

ఎస్ టి లు ఎక్కువగా ఉన్న త్రిపురారం, తిరుమలగిరి మండలాలకు ఎస్ టి వర్గాలకు చెందిన వారిని ఇన్ చార్జిగా నియమించడం వెనుక ఉన్న వ్యూహం కూడా ఇదే. నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండడంతో ఆ వర్గం వారిని కూడ అధికంగా రంగంలోకి దించారు. ప్రతి మండలంలో సామాజిక వర్గంలో బలమైన వారితో కలిసి, ఓట్లుగా మార్చుకునేలా చర్చలు సాగిస్తున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలాగే సభలు సమావేశాలు నిర్వహించారు. మన కులం నేతగా నేను ఉన్నాను.. నాకు పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. మీకు అండగా నేను ఉంటానని ఆయా కులాల వారికి నేతలు చెబుతున్నారంట. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేలంతా వివిధ కులాల నేతలుగానే నాగార్జున సాగర్ లో మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలంతా ఇప్పుడు తాము ప్రజా ప్రతినిధులం అని మర్చి పోయారనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి.

ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ కూడ అనుసరించే ప్రయత్నంలో ఉందట. కాంగ్రెస్ కూడ కులాల వారిగా సమావేశాలను చేయనుందట. టిఆర్ఎస్ ప్రయోగాన్ని ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ కూడ అదే కులాల రాజకీయాలకు రెడీ అవుతోందట. త్వరలో యాదవులందరితో కుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ బావిస్తోందంట. దీంతో సాగర్ ఎన్నిక చివరికి కులాల మధ్య ఈక్వేషన్‌ గా మారిన పరిస్థితి ఏర్పడింది.

Also Read : నివేదిత అలక వీడినట్లేనా ?పార్టీ మార్పు ఆగిపోయినట్లేనా ?

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet girişHoliganbet Giriş