Idream media
Idream media
ప్రభుత్వ బ్యాంకులకు నష్టం కలిగించినందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కేస్ నమోదు అయింది. ఆయన అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ ఖాతాను ప్రైవేట్ బ్యాంకుకు తరలించినందుకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఖాతాను ఎస్‌బిఐ నుండి యాక్సిస్ బ్యాంక్‌కు మార్చడంతో దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ సిఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జబల్‌పూర్ మార్చిలో ముంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు శాఖ జీతం ఖాతాలను యాక్సిస్ బ్యాంక్‌కు బదిలీ చేసినందుకు మాజీ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. పిటిషన్‌పై స్పందించాలని బొంబాయి హైకోర్టు ఫడ్నవీస్‌కు నోటీసులు ఇచ్చింది. ఎనిమిది వారాల్లో సమాధానాలు కోరుతూ బొంబాయి హైకోర్టు హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు నోటీసులు జారీ చేసింది.
ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అయిన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వాన్ని యాక్సిస్ బ్యాంక్ అతి ముఖ్యమైన ఖాతాదారుల్లో ఒకటిగా చేశారు. మహా ప్రభుత్వం యాక్సిస్ బ్యాంకులో రూ.11,000 కోట్లకు పైగా విలువైన రెండు లక్షల మంది పోలీసు సిబ్బంది జీతం ఖాతాను అనుసంధానించింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆ ఖాతాలను యాక్సిస్ బ్యాంక్ నుండి తొలగించి జాతీయ బ్యాంకు ఎస్‌బిఐ బదిలీ చేశారు. ఇంతకు ముందు ఈ ఖాతాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లోనే ఉన్నాయి.
శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపి ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ బ్యాంకుకు ఆ ఖాతాలను బదిలీ చేయాలని నిర్ణయించింది. నివేదికల ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ బ్యాంక్‌లోని తన ఖాతాల్లో ఒకదాన్ని మూసివేసి, దానిని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎస్‌బిఐకి మార్చింది. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేవేంద్ర ఫడ్నవిస్ కు, అతని భార్య సీనియర్ హోదాలో పనిచేస్తున్న ప్రైవేట్ బ్యాంకైనా యాక్సిస్ బ్యాంక్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై బుధవారం నాగ్‌పూర్‌లోని సీతాబుర్ది పోలీస్‌స్టేషన్‌లో “కుట్ర పన్నినందుకు, తన పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుకు నష్టం కలిగించినందుకు” అని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫడ్నవిస్ తన భార్య అమృతా ఫడ్నవిస్‌ను “లాభదాయక పని”లో పాల్గొనడానికి అనుమతించారని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త మోహ్నీష్ జబల్‌పురే ఫిర్యాదు చేశారు. “మాజీ సిఎం ఒక ప్రభుత్వ ఖాతాలను ప్రభుత్వ బ్యాంకు నుండి యాక్సిస్‌కు బదిలీ చేయడానికి అనుమతించడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుకు భారీ నష్టాన్ని కల్పించారు” అని మోహ్నీష్ ఆరోపించారు.
“2017 మే 11న అప్పటి బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పోలీసు సిబ్బందితో పాటు సంజయ్ గాంధీ నిరధర్ యోజన లబ్ధిదారుల వేతన ఖాతాలను యాక్సిస్ బ్యాంకుకు బదిలీ చేసింది. ఇంతకు ముందు ఈ ఖాతాలను నిర్వహిస్తున్న ప్రభుత్వ బ్యాంకులకు ఇది నష్టాన్ని కలిగించింది” అని జబల్పూర్ ఆరోపించారు.
పోలీసు శాఖ యొక్క ఖాతాలను యాక్సిస్ బ్యాంకుకు బదిలీ చేసిన సమయంలో అమృతా ఫడ్నవిస్ యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ పదవీ కాలంలో అమృతా ఫడ్నవిస్ కార్పొరేట్ అధిపతి (పశ్చిమ భారత దేశం), యాక్సిస్ బ్యాంక్‌లో ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ పరిణామాలన్ని దృష్టిలో పెట్టుకొని కేసు నమోదు చేశారు.