iDreamPost
android-app
ios-app

మైనర్ బాలికను గర్భవతిని చేసిన ప్రధానోపాధ్యాయురాలి భర్త

మైనర్ బాలికను గర్భవతిని చేసిన ప్రధానోపాధ్యాయురాలి భర్త

దేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయంటూ ఓ వైపు యావత్ ప్రజానీకం ఆందోళనలు చేస్తుంటే, మరోపక్క మహిళలపై, ఆడపిల్లలపై రోజుకో అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తుంది. తాజాగా ఒడిషా రాష్ట్రంలోని కోరపూట్ జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన సంచలనంగా మారింది.

ఆడపిల్లలకు రక్షణ కరువైంది. గుడిలో, వీధిలో, బడిలో ఎక్కడ రక్షణ ఉండటం లేదు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో ఏదో ఒక ప్రాంతంలోఎక్కడో ఒకచోట ఆడపిల్లలపై అమానుషంగా అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి ప్రభుత్వ హాస్టల్ లో కూడా విద్యార్ధినుల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది.

ఒడిషాలో రాష్ట్ర ప్రభుత్వం చేత నడుపబడుతున్న ఎస్సీ,ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో గిరిజన మైనర్ బాలికను ప్రధానోపాధ్యాయురాలి భర్త గర్భవతిని చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎస్సీ,ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను భయపెట్టి ప్రధానోపాధ్యాయురాలి భర్త పలుమార్లు అత్యాచారం చేయడం వల్ల తను గర్భవతి అయ్యింది. ఈ విషయం భయటపడటంతో సదరు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్యతో కలసి స్టాఫ్ క్వార్టర్స్ లో ఉంటున్న నిందితుడు, మైనర్ బాలిక పై పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఒప్పకున్నాడని జయపూర్ పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈవిషయాలు తన భార్యకు తెలియవని 60ఏళ్ళ నిందితుడు స్పష్టంచేశాడు. నిందితుడి పై పోక్ సో, ఎస్సీ ఎస్టీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

బాలికను వైద్య పరీక్షల తర్వాత పిల్లల సంరక్షణ సంస్థలో ఉంచుతామని జిల్లా పిల్లల రక్షణ అధికారి రాజ్‌శ్రీ దాస్‌ తెలిపారు. ఎస్సీ,ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి మధుస్మితా మోహపాత్రా చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తన భర్తను స్టాఫ్ క్వార్టర్స్ లో ఉంచినందుకు తనపై చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె స్పష్టం చేశారు.