iDreamPost
android-app
ios-app

బీచ్‌‌లో నగ్నంగా పరుగెత్తిన నటుడిపై కేసు నమోదు..

బీచ్‌‌లో నగ్నంగా పరుగెత్తిన నటుడిపై కేసు నమోదు..

పుట్టినరోజు సందర్భంగా తానెంత ఫిట్‌గా ఉన్నానో ప్రజలకు తెలిపేందుకు నగ్నంగా బీచ్‌‌లో పరుగులు తీసిన ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్‌‌పై కేసు నమోదైంది.

55 వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మిలింద్ సోమన్ తన భార్య అంకిత కోన్వర్‌ ఫోటోలు చిత్రీకరిస్తుండగా ఒంటిపై నూలు పోగన్నది లేకుండా బీచ్ వెంట పరుగులు తీయడమే కాకుండా నగ్నంగా పరుగెత్తిన ఫోటోలను సామాజికమాధ్యమాల ద్వారా షేర్ చేసాడు. మిలింద్ సోమన్ నగ్నంగా పరిగెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా బీచ్‌‌లో న్యూడ్‌‌గా పరిగెత్తడంతోపాటు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గోవా సురక్షా మంచ్ అనే సంస్థ మిలింద్ సోమన్‌‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 294, సెక్షన్ 67 ప్రకారం మిలింద్ మీద కేసు నమోదు చేశారు.

ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండేపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. గోవా బీచ్‌‌లో చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించినందుకు గోవా పోలీసులు గురువారం పూనమ్ పాండేను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మిలింద్ సోమన్‌‌పైనా కేసు నమోదు చేయాలని పలువురు డిమాండ్లు చేశారు. కాగా బీచ్‌‌లో నగ్నంగా పరిగెత్తినందుకు గాను మిలింద్ సోమన్‌‌పై కేసు నమోదు చేశామని సౌత్ గోవా ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ వెల్లడించారు.