తెలంగాణ లోని హుజూర్నగర్ శాసన సభ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ దూసుకెళుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా 10 గంటల సమయంలో 8వ రౌండ్ ముగిసే సరికి అధికార పార్టీ అభ్యర్థి సైది రెడ్డి 17,400 ఓట్ల ఆధిక్యం లో ఉన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (పిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడం తో ఖాళీ ఐన స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేశారు. మధ్యాహాన్నం కల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.