iDreamPost
android-app
ios-app

మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కారు బోల్తా

మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కారు బోల్తా

నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బోల్తాపడడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే దొంతి మాధవ రెడ్డి తన కారులో హన్మకొండ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా జనగామ లిమిట్స్ బైపాస్ ఇందిరమ్మ కాలనీ వద్ద ఓ బైక్ ను ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పక్కనే ఉన్న గోతిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయినట్లు సమాచారం. కాగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రాణాపాయం తప్పింది. ఆయన కారు డ్రైవర్ కి కూడా స్వల్ప గాయాలయ్యాయి.తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.

గతంలో దొంతి మాధవరెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.మాజీ ఎమ్మెల్యే అభిమానులు ఆయనకు ప్రమాదం జరిగినట్లు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.