iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ట్రిపుల్ బొనాంజా ఇస్తాడా?

  • Published Jan 24, 2023 | 8:38 PM Updated Updated Dec 23, 2023 | 11:28 AM
ప్రభాస్ ట్రిపుల్ బొనాంజా ఇస్తాడా?

రెండేళ్లకో ఒక సినిమా మించి ఇవ్వలేకపోతున్న డార్లింగ్ ప్రభాస్ వేగం పెంచాడు. ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిటైపోయి వరస షూటింగులతో తెగ బిజీగా ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం దీనికి తగ్గ మంచి ఫలితాలు అభిమానులు చూడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న ప్లానింగ్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే కేవలం ఏడాది కాలంలో ఒకటి రెండు కాదు ఏకంగా మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ని ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేయొచ్చు. ఇంత తక్కువ గ్యాప్ లో ఇంత వేగంగా ప్రభాస్ ఎప్పుడూ చేయలేదు.

అదెలాగో చూద్దాం. టీజర్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్, వివాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం గ్రాఫిక్స్ ని రిపేర్ చేసే పనిలో ఉన్న ఆది పురుష్ టీమ్ మరోసారి జూన్ 16 రావడం కన్ఫర్మ్ అని ఇటీవలే కొత్త కౌంట్ డౌన్ అప్ డేట్ తో ట్విట్టర్ లో అనౌన్స్ చేసింది. సో వెనుకడుగు ఉండకపోవచ్చు. దర్శకుడు ఓం రౌత్ మీరు ఊహించని మార్పులు చూస్తారని ఇప్పటికే తెగ ఊరిస్తున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కాబట్టి గెటప్స్ మీద వచ్చిన క్రిటిసిజంని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా చాలా కీలకమైన మార్పులు చేస్తున్నారు

సలార్ సెప్టెంబర్ 28 రావడం పక్కాని హోంబాలే ఫిలిమ్స్ మరోసారి స్పష్టంగా ప్రకటించింది. షూటింగ్ పూర్తి కావొస్తోంది కాబట్టి ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కెజిఎఫ్ ని మించి దర్శకుడు ప్రశాంత్ నీల్ దీన్ని తీర్చిదిద్దుతున్నట్టుగా ఆల్రెడీ టాక్ ఉంది. ఇవి కాకుండా 2024 జనవరి సంక్రాంతి పండక్కు ప్రభాస్ మారుతీ కాంబో మూవీని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో డిస్కషన్లు జరుగుతున్నాయి. అంటే కేవలం తొమ్మిది నెలల టైంలో ఏకంగా మూడు సినిమాలంటే పెద్ద షాకే. మూడోది అఫీషియల్ గా ఖరారు కాలేదు కానీ దాదాపుగా దాన్నే టార్గెట్ పెట్టుకుని షూట్ చేస్తున్నారని టాక్. ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbetvaycasinomarsbahis giriş