iDreamPost
android-app
ios-app

సౌత్, నార్త్ ఇండస్ట్రీ అంటూ ఏమి లేవు.. బాలీవుడ్ స్టార్ హీరో వ్యాఖ్యలు..

  • Published May 23, 2022 | 5:11 PM Updated Updated May 23, 2022 | 5:11 PM
సౌత్, నార్త్ ఇండస్ట్రీ అంటూ ఏమి లేవు.. బాలీవుడ్ స్టార్ హీరో వ్యాఖ్యలు..

గత కొన్ని రోజులుగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో మంచి విజయాలు సాధిస్తుండటంతో అంతా సౌత్ సినీ పరిశ్రమ, నార్త్ సినీ పరిశ్రమ అంటూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ , నార్త్ అంటూ సెలబ్రిటీలు కూడా మాట్లాడారు. ఇది కాస్త ఇటీవల హిందీ, లోకల్ లాంగ్వేజ్ వార్ గా కూడా మారింది. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వీటిపై వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ త్వరలో పృథ్వీరాజ్‌ సినిమాతో రానున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా జూన్‌ 3న విడుదలవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు అక్షయ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ సౌత్, నార్త్ ఇండస్ట్రీల గురించి మాట్లాడాడు.

అక్షయ్ మాట్లాడుతూ.. సినిమాని ఇలా సౌత్, నార్త్ అని ఎందుకు విడదీస్తున్నారో అర్ధం కావట్లేదు. ఏదైనా ఇండియన్ సినిమానే. ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద ఆడాలనే అంతా కోరుకుంటాం. ఇలా సౌత్, నార్త్ విడగొట్టి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటే. బ్రిటిష్ పాలకులు వచ్చి మనల్ని విభజించి పాలించారు. ఇప్పుడు మనం కూడా అదే చేస్తామంటే ఎలా? అందరూ కలిసి పని చేస్తేనే మంచి సినిమాలు వస్తాయి అని అన్నారు.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş