iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ, నేను కలిసి ఎంజాయ్ చేశాం.. అతనికి పడిపోయాను కూడా..

  • Published May 15, 2022 | 5:20 PM Updated Updated May 15, 2022 | 5:20 PM
విజయ్ దేవరకొండ, నేను కలిసి ఎంజాయ్ చేశాం.. అతనికి పడిపోయాను కూడా..

విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జంటగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పూరి జగన్నాద్, ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులని జరుపుకుంటుంది. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా హీరోయిన్ అనన్య పాండే ఓ హిందీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి, విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. అనన్య పాండే విజయ్ గురించి మాట్లాడుతూ.. ”విజయ్ చాలా మంచివాడు. నాకు షూట్ లో చాలా సపోర్ట్ చేశాడు. విజయ్ అద్భుతమైన వ్యక్తి. అతనికి దయాగుణం చాలా ఎక్కువ. సెట్ లో ఎప్పుడూ సరదాగా ఉంటాడు, అందర్నీ నవ్విస్తాడు. బ్రేక్ దొరికితే ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. అతనిలో అన్ని మంచి విషయాలు ఉన్నాయి కాబట్టే అతనికి పడిపోయాను” అని తెలిపింది.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ”లైగర్‌లో భాగమైనందుకు పూరీ జగన్నాద్ డైరెక్షన్‌లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమెరికాలో ‘లైగర్‌’ షూట్‌ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ షెడ్యూల్‌ని చాలా బాగా ఎంజాయ్‌ చేశాం. షూటింగ్‌, నా డబ్బింగ్‌ కూడా పూర్తి అయిపోయింది. ఫుల్ కమర్షియల్ సినిమా ఇది. అందరికి నచ్చుతుంది” అని తెలిపింది.

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibomcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/