Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం భోదన ను బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సమర్ధించారు. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు భాష ను పూర్తిగా విస్మరించకుండా ఇంగ్లీష్ మీడియం ను అమలు చేయాలని సూచించారు. కాగా రాజధాని పై కూడా విష్ణుకుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సచివాలయం, అసెంబ్లీ లను అమరావతి లో ఉంచి మిగతా కార్యాలయాలను ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో భోదన జరిపేందుకు జగన్ సర్కారు నిర్ణయించిన విషయం విదితమే. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కొక్క తరగతి ని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చనున్నారు. ఈ విధానాన్ని ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీ నేతలు వ్యతిరేకిస్తుండగా, బిజెపి నేతలు స్వాగతిస్తున్నారు.