iDreamPost
android-app
ios-app

బిజేపీ నేత ఖుష్భూ కి తప్పిన ప్రమాదం

  • Published Nov 18, 2020 | 5:57 AM Updated Updated Nov 18, 2020 | 5:57 AM
బిజేపీ నేత ఖుష్భూ కి తప్పిన ప్రమాదం

ప్రముఖ సినీ నటి బీజేపి నేత ఖుష్బూ సుందర్ కు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును తమిళనాడులోని మెల్మార్‌వత్తూర్ దగ్గర ఒక కంటెయినర్ ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. అయితే ఆ సమయంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి ఖుష్భూ సురక్షితంగా బయటపడ్డారు, దేవుడి దయ, అభిమానుల ఆశీస్సులే తనను ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడేలా చేశాయని ఖుష్బూ ట్వీట్ చేశారు.

ఈ ప్రమాదంలో ఖుష్బూ ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా దెబ్బతినడంతో కడలూరులో తాను పాల్గొనాల్సిన కార్యక్రమానికి వేరే వాహానంలో బయల్దేరినట్టు ఆమె పేర్కొన్నారు. ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఖుష్బూ సుందర్ …