ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు గారు చంద్రబాబు నాయుడు గారి పంథాలో నడుస్తునట్టు కనిపిస్తుంది. ముందుగా తాను ఒక మాట అనటం ఆ తరువాత తాను అలా అనలేదు అని వెంటనే యు టర్న్ తీసుకోవడం అలవర్చుకున్నట్టు కనిపిస్తుంది. నిన్నటి రోజున మండలి స్థాయి బీసీ నాయకులని తమ పార్టీలో చేర్చుకునే సందర్భంలో మాట్లాడుతూ తమ పార్టి వచ్చే ఎన్నికల్లో బీసిని ముఖ్యమంత్రిని చేస్తుంది. మాది బీసిలకి అండగా ఉండే పార్టీ అని ఉపన్యాసం దంచి కొట్టారు. అయితే జాతీయ స్థాయి పార్టీలో ముఖ్యమంత్రులని రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఎలా నిర్ణయిస్తాడు అని అప్పుడే పలువురు సందేహాలను వ్యక్తపరిచారు.
అయితే సోమూ వీర్రాజు తాను చేసిన బీసీ ముఖ్యమంత్రి జపం కనీసం 24 గంటలు కూడా గడవక ముందే వెనక్కి తీస్కుంటున్నట్టు తాను బీసిని ముఖ్యమంత్రిని చేస్తా అని అనలేదని, తమది జాతీయ పార్టీ అని, రాష్ట్ర ముఖ్యమంత్రులను నడ్డ గారు, మిత్రపక్షం పవన్ కల్యాణ్ తో చర్చించి ప్రకటిస్తారని, ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించే అవకాశం తనకి లేదని ప్రకటించారు.
Also Read: ఏపీలో అధికారంలోకి వస్తే బీసీ సీఎం – సోము వీర్రాజు
అయితే 2014 ఎన్నికల సమయంలో బీసీ నేత అయిన ఆర్ కృష్ణయ్యను చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. గెలిచే అవకాశం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించకుండా డిపాజిట్లు కూడా దక్కే అవకాశంలేని తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించి చంద్రబాబు బీసీ ఓట్లకొసం పాకులాడినట్టే రాష్ట్రంలో బీజేపీ కూడా చంద్రబాబు బాటలోనే ఒట్ల వేటలో బీసీ కార్డుని తీసి వారిని తమ రాజకీయ పావుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తుందా అనే వాదన సోము వీర్రాజు ప్రకటనలు ఆ తరువాత తీసుకున్న యు టర్న్ ద్వారా వ్యక్తం అవుతుంది.