బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఇప్పటిదాకా ముగ్గురు టీవీ9 జర్నలిస్టులు ఆయా సీజన్లలో సందడి చేశారు. వీరిలో దీప్తి ఎక్కువ రోజులు బిగ్ హౌస్‌లో వున్న కంటెస్టెంట్‌గా రికార్డ్ సొంతం చేసుకున్న విషయం విదితమే. రెండో సీజన్ కోసం ఆమె బిగ్ హౌస్ కంటెస్టెంట్‌గా వున్నారు. ఆ తర్వాత జాఫర్, మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వున్నా, ఎక్కువ రోజులు హౌస్‌లో వుండలేకపోయారు. ఇక, ఇప్పుడు మరో కంటెస్టెంట్ టీవీ9 నుంచి బిగ్‌హౌస్‌లో సందడి చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు, దేవీ నాగవల్లి. నిజంగానే ఆమె ఈ సీజన్‌కి సంబంధించి సర్‌ప్రైసింగ్ కంటెస్టెంట్ అని చెప్పక తప్పదు. ‘ఇంట్రో’నే ఓ రేంజ్‌లో ఆమె మీద చిత్రీకరించడంతో అంతా అవాక్కయ్యారు. ఇక, హౌస్‌లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తున్న దేవీ నాగవల్లి, వీకెండ్ టాపర్‌గా మారారనే చర్చ బిగ్ బాస్ రియాల్టీ షో వ్యూయర్స్‌లో జరుగుతోంది. వారంలో ఐదు రోజులు ఆమె ఎలా పెర్ఫామ్ చేశారన్న విషయాన్ని పక్కన పెడితే, వీకెండ్‌లో మాత్రం అదరగొట్టేశారు. మరీ ముఖ్యంగా ఆదివారం జరిగిన ‘జుగల్బందీ’ డాన్స్ షోలో అయితే, దేవి నాగవల్లి అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. మిగతా కంటెస్టెంట్లూ డాన్స్ అదరగొట్టేసినాసరే, దేవి నాగవల్లికి మిగతా విభాగాల్లోనూ మంచి మార్కులు పడ్డాయి. హౌస్‌లో కట్టప్ప క్యారెక్టర్ లేనే లేదని మొదటి నుంచీ దేవి వాదిస్తూ వచ్చింది.. అదే నిజమయ్యింది కూడా. ఇదే టెంపో మెయిన్‌టెయిన్ చేస్తే, ఈ సీజన్ టాపర్.. అదేనండీ టైటిల్ విన్నర్‌గా దేవి అదరగొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.