దర్శకుడు సూర్య కిరణ్, కేవలం ఒకే ఒక్క వారంలో బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్ 4 నుంచి ‘ఔట్’ అయిపోయాడు. సూర్యకిరణ్ వెళ్ళిపోవడమేంటి? అనే చర్చ సర్వత్రా జరుగుతున్న సమయంలో, రెండో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది. ఈసారి వికెట్ పడేదెవరు.? ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేట్ అయినవారిలో వీకెస్ట్ కంటెస్టెంట్ అని అనలేంగానీ, బయట ఏమాత్రం ఫాలోయింగ్ లేని కంటెస్టెంట్‌గా కళ్యాణి గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కళ్యాణి వికెట్ పడిపోవడం ఖాయమని బిగ్‌బాస్ వ్యూయర్స్ అంచనా వేస్తున్నారు. అంచనా వేయడం కాదు, ‘అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం’ అని తేల్చస్తున్నారు. అంతేనా, ‘బిగ్‌బాస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం’ అంటూ కళ్యాణి వికెట్ డౌన్ వ్యవహారంపై గాసిప్స్ ప్రచారంలోకి తెస్తున్నారు. నిజానికి, ఎవరైతే సూర్యకిరణ్ ఎలిమినేషన్ గురించి చెప్పారో, వాళ్ళే కళ్యాణి ఎలిమినేషన్ గురించి చెబుతుండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే, కళ్యాణి చాలామంది కంటెస్టెంట్స్‌తో పోల్చితే యాక్టివ్‌గానే వుంటోంది. పైగా, గొడవలు సృష్టించడంలో దిట్ట కూడా. అలాంటి కళ్యాణిని ఎలిమినేట్ చేయడం ద్వారా బిగ్‌బాస్ నిర్వాహకులు ఏం సంకేతాలు పంపాలనుకుంటున్నారో.? అయితే, ఇదంతా ఇప్పటి స్పెక్యులేషన్ మాత్రమే. ఈక్వేషన్స్ ఎలాగైనా మారొచ్చు. అనూహ్యమైన నిర్ణయాలూ వుండొచ్చు. అయితే, యంగ్ కంటెస్టెంట్స్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్తగా తెచ్చే క్రమంలో, తాము తీసెయ్యాలనుకుంటున్న ఒక్కొక్కర్నీ తీసేస్తున్నారనే వాదనలూ లేకపోలేదు.