iDreamPost
android-app
ios-app

లోకనాయకుడి ఎంట్రీ – ఎలిమినేషన్ ట్విస్ట్

  • Published Nov 08, 2020 | 6:29 AM Updated Updated Nov 08, 2020 | 6:29 AM
లోకనాయకుడి ఎంట్రీ – ఎలిమినేషన్ ట్విస్ట్

ఇంకో 37 రోజుల్లో బిగ్ బాస్ 4 క్లైమాక్స్ కి రాబోతున్న తరుణంలో ఆట కొత్త మలుపులు తీసుకుంటోంది. వైల్డ్ కార్డు ఎంట్రీగా కొత్తగా ఎవరూ వచ్చే సూచనలు పెద్దగా కనిపించడం లేదు. గాయని మంగ్లీ అన్నారు కానీ తనేమో వృత్తిలో చాలా బిజీగా ఉంది. ఇక నిన్న ఎపిసోడ్ విషయానికి వస్తే తమిళ బిగ్ బాస్ హౌస్ నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ అక్కడి పార్టిసిపెంట్స్ తో సహా టీవీ స్క్రీన్ ద్వారా నేరుగా పలకరించడం హై లైట్ అయ్యింది. పరస్పరం ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాక కమల్ ద్వారా నాగ్ ఎలిమినేషన్ లిస్టులో ఉన్న హారికను సేవ్ చేయించారు. దీంతో ఈ సోషల్ మీడియా స్టార్ ఆనందాన్ని పట్టడం ఎవరి వల్లా కాలేదు.

దీనికన్నా ముందు ఎప్పటిలాగే డ్రామాలు, డిస్కషన్లు జరిగాయి. ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారనే దాని గురించి అవినాష్, అరియానా, అమ్మ రాజశేఖర్ ల మధ్య కాసేపు చర్చ జరిగింది. నెయ్యి విషయంలో సోహైల్ అరియానాలు నువ్వా నేనా అనే రీతిలో మాటల్లో గట్టిగానే గొడవ పడ్డారు. నాగార్జున ఎలిమినేషన్ గురించి అడిగినప్పుడు మాస్టర్ తెలివిగా సమాధానం చెప్పబోయాడు కానీ తనకు రివర్స్ కౌంటర్ తగిలింది. అభిజిత్ మిగిలిన సభ్యుల్లో చెప్పిన మాట వినని అమ్మ రాజశేఖర్ నే బయటికి పంపాలని చెప్పాడు. ఇందులో తనకు కూడా నాగ్ వైపు నుంచి చురకలు పడ్డాయి. ఇంగ్లీష్ లో మాట్లాడితే వచ్చే చిక్కుల గురించి కూడా చెప్పుకున్నారు.

ఇక దీపావళి కాన్సెప్ట్ తో నాగార్జున ఇచ్చిన వెలిగే దీపం ఆరిపోయే దీపం టాస్కులో లిస్టులో ఒక్కొక్కరు ఒక ఇన్ ఒక అవుట్ ఆప్షన్ ని ఎంచుకోమని చెప్పారు. ఆ తర్వాత మోనాల్ కు ఓదార్పు యాత్ర చేశారు నాగ్. అఖిల్ తనపై గుడ్డు పెట్టడం గురించి తెగ ఎమోషనల్ అవుతూ వివరణ ఇచ్చింది. దీనికి అఖిల్ లోని అసలు సిసలు అపరిచితుడు బయటికి వచ్చి సమాధానం చెప్పాడు. అతని ఓవర్ యాక్షన్ కి మోనాల్ దీపం రూపంలో రివెంజ్ తీర్చుకుంది. ఇక మెహబూబ్, అవినాష్, లాస్య తదితరులతో మాట్లాడక నాగ్ ఫైనల్ గా కమల్ ఎపిసోడ్ తో ముగించారు. ఇక ఈ రోజు అమ్మ రాజశేఖర్ ను ఎలిమినేట్ చేస్తారని ఇప్పటికే లీక్ వచ్చింది. సో పెద్ద నాటకమే చూడొచ్చు

jojobet girişJojobet Casino Sitesijojobetjojobet giriş adresimarsbahis girişmarsbahismarsbahis giriş