iDreamPost
android-app
ios-app

ఫినాలే రేస్ సిద్ధం – వరస్ట్ కెప్టెన్ అరియనా

  • Published Nov 28, 2020 | 5:56 AM Updated Updated Nov 28, 2020 | 5:56 AM
ఫినాలే రేస్ సిద్ధం – వరస్ట్ కెప్టెన్ అరియనా

నెలల తరబడి సాగిన బిగ్ బాస్ 4 ఇక వారాల్లోకి మారి అతి త్వరలో క్లైమాక్స్ కు చేరబోతోంది. ఖచ్చితంగా ఏ డేట్ లో ఫైనల్ ఉంటుందో ఇంకా చెప్పలేదు కానీ దానికి తగ్గట్టు రంగం ఇప్పటి నుంచే సిద్ధమైపోతోంది. ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్లన్నీ దాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇక నిన్నటి సంగతి చూస్తే జలజ దెయ్యం ఎంట్రీ తర్వాత సభ్యులు ఆశించిన స్థాయిలో ఎవరూ గేమ్ ఆడటం లేదని బిగ్ బాస్ చురకలు అంటించాడు. ముఖ్యంగా అభిజిత్ తనకు ఇచ్చిన టాస్కులు నిరాకరించడంతో వరస్ట్ పర్ఫార్మర్ గా ప్రకటించడం పెద్ద ట్విస్ట్. ఇకనైనా లగ్జరీ టాస్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మిగిలినవాళ్లకు హెచ్చరిక చేశాడు.

ఈ ఫెయిల్యూర్ కి కారణం ఏంటో మెంబెర్స్ డిస్కస్ చేసుకుని తనకు చెప్పాలని బిగ్ బాస్ హుకుం జారీ చేశాడు. ఇందులో భాగంగా అవినాష్ మాట్లాడుతూ అఖిల్ మోనాల్ ల డేటింగ్ లతో పాటు అభిజిత్ ప్రస్తావన తీసుకురావడంతో వాతావరణం వేడెక్కింది. బిగ్ బాస్ కు అభిజిత్ తన వర్షన్ లో క్లారిటీ ఇచ్చాడు. మోనాల్ తో డేట్ అనే పదమే నచ్చలేదని, తనను ఏడిపించాననే మాట వల్ల హర్ట్ అయ్యానని చెబుతూనే ఏదైనా తప్పు జరిగి ఉంటే సారీ అని క్షమాపణ కూడా అడిగేశాడు. క్లారిటీ లేని టాస్కులు ఎలా చేయాలనీ ఆకులు లెక్కబెట్టడం ఉదాహరణగా చెబుతూ కౌంటర్ కూడా ఇచ్చాడు. మొత్తానికి లాజికల్ గానే మాట్లాడాడు

ఇక రేస్ టు ఫినాలే మొదలయ్యింది కాబట్టి ఇకపై కెప్టెన్ ఎవరూ ఉండరని చెప్పేశాడు బిగ్ బాస్. హారికను బ్యాండ్ తీసేయమని కోరుతూ ఇప్పటిదాకా ఆ బాధ్యతను నిర్వర్తించిన వాళ్ళు తమ అనుభవాలతో పాటు బెస్ట్ అండ్ వరస్ట్ కెప్టెన్స్ ఎవరో చెప్పాలని మెలిక పెట్టాడు. దాంతో ఒకరికొకరు తమ తమ పాయింట్ అఫ్ వ్యూలో అభిప్రాయాలను వెల్లడించారు. ఫైనల్ గా అరియనా పేరుని వరస్ట్ కెప్టెన్ గా కన్ఫర్మ్ చేయడం కొసమెరుపు. ఆమె బాగా ఫీలైపోయింది. ఇక చర్చల్లో భాగంగా మోనాల్ సోహైల్ హగ్ ఇవ్వడం మరో సుందరదృశ్యం. ఈ రోజు నాగార్జున వస్తున్నారు కానీ ఎలిమినేషన్లు ఉండకపోవచ్చని లీకవుతున్న టాక్ ని బట్టి తెలుస్తోంది

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbetvaycasinomarsbahis giriş