iDreamPost
android-app
ios-app

బిగ్ సర్ ప్రైజ్.. ‘ఎన్టీఆర్ 30’ మూవీ లాంచ్ కి మెగాస్టార్!

  • Published Jan 21, 2023 | 7:51 PM Updated Updated Jan 21, 2023 | 7:51 PM
బిగ్ సర్ ప్రైజ్.. ‘ఎన్టీఆర్ 30’ మూవీ లాంచ్ కి మెగాస్టార్!

‘ఆచార్య’ ఫలితంతో దర్శకుడు కొరటాల శివ పట్ల మెగాస్టార్ చిరంజీవి చాలా అసహనంగా ఉన్నాడనే ప్రచారం జరిగింది. చిరంజీవి సైతం ఆచార్య రిజల్ట్ తర్వాత దర్శకులు అలా ఉండాలి, ఇలా ఉండాలంటూ పలు సందర్భాల్లో చేసిన కామెంట్స్ పరోక్షంగా కొరటాలనే అన్నట్లుగా ఉండటంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదేంటంటే కొరటాల కొత్త సినిమా లాంచ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారట.

కొరటాల తన తదుపరి సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రకటన మే నెలలోనే వచ్చింది కానీ ఏవేవో కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ లాంచ్ కి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎందరు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి కుటుంబం, రామ్ చరణ్ కుటుంబంతో పాటు ఇంకా ఎందరో స్టార్స్ సందడి చేయనున్నారట. అంతేకాదు ఈ కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

‘ఎన్టీఆర్ 30’ మూవీ లాంచ్ కి చిరంజీవి రాబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ అంటే ఎన్టీఆర్ కి స్నేహితుడు, పైగా ఇద్దరూ ఆర్ఆర్ఆర్ లో కలిసి నటించారు. కాబట్టి చరణ్ ఈ మూవీ లాంచ్ కి రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిరంజీవి వస్తున్నాడనే వార్తే అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఒకవేళ నిజంగానే ‘ఎన్టీఆర్ 30’ మూవీ లాంచ్ కి చిరంజీవి హాజరైతే.. కొరటాలను టార్గెట్ చేశారనే ప్రచారానికి చెక్ పెట్టినట్లు అవుతుంది.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş