Idream media
Idream media
తెలంగాణ కాంగ్రెస్ విషయంలో హైకమాండ్ వడివడిగా నిర్ణయాలు తీసుకుంటోంది. మొన్నటికి మొన్న తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిని ఎంపిక చేసిన అధిష్టానం.. ఆ మరుసటి రోజే.. పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించింది.
అయితే.. రేవంత్ కు ఇవ్వడాన్ని ముందునుంచీ వ్యతిరేకించిన సీనియర్లు.. ఆ తర్వాత బహిర్గతం కాకపోయినప్పటికీ లోపల మాత్రం అసంతృప్తిగానే ఉన్నట్టు ప్రచారం జరిగింది. పీఠం కోసం చివరి వరకు పోరాటం చేసిన కోమటిరెడ్డి మాత్రమే బయటకు వెళ్లగక్కారు. దీనిపై తెలంగాణ ఇంచార్జి మాణిక్ టాగూర్ భట్టి నుంచి పూర్తి వివరాలు రాబట్టి నట్లు తెలిసింది. ఇక ఆరోపణలు కట్టిబెట్టి సీనియర్లు అందరూ కలిసి పనిచేసేందుకు ఏం చేస్తే మంచిదో ఆలోచించలని హితవు పలికినట్లు తెలిసింది.
రేవంత్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పదవి ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ లోని సీనియర్లను వరుసగా కలుస్తున్నారు. జానారెడ్డిని వీహెచ్ ను కలిసిన రేవంత్.. ఆ తర్వాత జరిగిన పీసీసీ భేటీలో అందరినీ కలుపుకునే వెళ్తానని అన్నారు. తాను చిన్నవాడిని అంటూ.. సీనియర్లను కూల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే.. ఉన్నట్టుండి సీఎల్పీ నేతగా ఉన్న బట్టికి పిలుపురావడంతో అందరిలో అటెన్షన్ క్రియేట్ అయ్యింది. ఎందుకు పిలిచింది? అని చర్చించుకుంటున్నారు. అయితే.. సీనియర్ల విషయంలో ఉన్న అసంతృప్తి విషయం గురించి ఆరాతీసేందుకే పిలుపు వచ్చిందని అంటున్నారు. భట్టి విక్రమార్క తిరిగి వస్తే తప్ప ఈ విషయమై క్లారిటీ వచ్చేలా లేదు.
అలాగే, ఇటీవల సీఎం కేసీఆర్ ను కూడా భట్టి విక్రమార్క కలిశారు. ఇది కూడా పార్టీలో చర్చకు దారి తీసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి రాజుకుంటున్న వేళ.. భట్టి సీఎంను కలవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని కొందరు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో భట్టి తో ఈ విషయం పై కూడా మాట్లాడి నట్లు తెలిసింది