గడచిన రెండున్నరేళ్ళలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి గొప్ప సంపద సమకూర్చిపెట్టారు. ప్రత్యర్ధులు ఆయనను విమర్శించవచ్చు. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసి కాలం వెళ్ళబుచ్చుతున్నాడు అని ఎగతాళి చేసినా, అసలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగింది ప్రశ్నించినా బెజవాడ బెంజిసెంటర్ సజీవ సాక్ష్యంగా నిలబడింది అని చూపించవచ్చు.
యావత్ భారత దేశం ఆ మాటకొస్తే యావత్ ప్రపంచం కరోనాతో విలవిల్లాడిపోతుంటే, ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో ప్రజలు ప్రాణాలపై ఆశలు కోల్పోయి తమ జీవితకాలంలో సంపాదించిన సొమ్ము వీధుల్లో విసిరేస్తుంటే, ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ చర్య ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. యావత్ ప్రపంచం ద్రుష్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై పడింది.
Also Read : జగన్ ఏం చెప్పారో.. అదే చేస్తున్నారు..
జూన్ 30, 2020న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విజయవాడలోని బెంజిసెంటర్ సాక్షిగా 1,088 అంబులెన్స్ వాహనాలను కవాతు చేయించారు. బెజవాడ బందర్ రోడ్డుపై వెయ్యి అంబులెన్సులు ఏకకాలంలో కవాతు చేస్తుంటే కరోనాను తరిమికొడుతున్నట్టు ప్రపంచానికి కనిపించింది. ఆ వాహనాల కవాతు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఓ భరోసా ఇచ్చింది. ఆ కవాతుకు తగ్గట్టే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను విస్తృతం చేసి కోవిడ్ చికిత్సను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్యసేవలు ప్రవేశపెట్టి, వందల మంది డాక్టర్లను, వేలమంది నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించింది. అలాగే రాష్ట్రంలో వైస్సార్ విలేజ్ క్లినిక్ ల నిర్మాణం మొదలు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల తలుపులు తెరిచి అదనపు సౌకర్యాలు కలిపించింది. జిల్లాకొక మెడికల్ కాలేజీ ఉండాలనే నిర్ణయం తీసుకుని ఒకేసారి 16 వైద్యకళాశాలలు, వాటికి అనుబంధంగా బోధనాసుపత్రులు నిర్మిస్తోంది. ఈ నిర్మాణాలు ఇంకా పూర్తి కాకుండానే షుమారు రెండువేలమంది వైద్యుల నియామకం చేపట్టింది.
Also Read : సీఎం జగన్ గురించి అగ్రిగోల్డు బాధితులు ఏమనుకుంటున్నారు..?
రాష్ట్రంలో ప్రాధమిక ఆరోగ్య కేద్రం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల నుండి జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రధాన నగరాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులలో మొదటిసారిగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఆస్పత్రిలో ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పించింది.
ఇవన్నీ ఒక ఎత్తైతే, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ హబ్ ఏర్పాటు చేయాలనీ, ప్రతి మెడికల్ హబ్ ఐదు నుండి పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించి అందుకు చర్యలు చేపట్టింది. ప్రతి మెడికల్ హబ్ లోనూ అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రావాలని, ఏ వైద్యానికి కూడా మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటోంది.
Also Read : ఏపీలో ఆ పధకం తెచ్చిన మార్పులు ఏమిటి..?
వైద్యం ఇలా పురోగతి సాధిస్తూ ఉంటే తెల్ల రేషన్ కార్డుపై నిత్యావసర సరుకులు తీసుకునే అవ్వా తాతలకోసం, ఇంకా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికోసం ఇంటింటికీ రేషన్ పేరుతో 2500 వాహనాలను ఈ యేడాది జనవరి 20న మళ్ళీ బెజవాడ బెంజిసెంటర్ వేదికగా బందరు రోడ్డుపై కవాతు చేయించారు జగన్మోహన్ రెడ్డి. ఏవో కొన్ని ఇళ్ళు సందుల్లోనో, కొండలపైనో ఉంటే మినహా మిగిలిన లబ్ధిదారులందరికీ నెలనెలా రేషన్ గుమ్మంలోకి వస్తోంది. రేషన్ కోసం కనీసం ఓ కిలోమీటర్ నడిచి, డీలర్ ఉండి, లేక ఇబ్బందులు పడుతూ, ఇచ్చిన రేషన్ ఇంటికి మోసుకు రాలేక ఇబ్బందిపడే అవ్వా, తాతలకు, వికలగులకు, ఒంటరి మహిళలకు ఈ వాహనాలు ఆసరాగా నిలిచాయనడంలో సందేహం లేదు. పైగా ఈ 2500 వాహనాల్లో ఒక్కోదానిలో ఒక్కో డ్రైవర్ అంటే 2500 కుటుంబాలకు ఉపాధి లభించినట్టే. అలాగే ఒక్కో వాహనంలో ఓ సహాయకుడు అంటే మరో 2500 కుటుంబాలకు ఆసరా దొరికినట్టే. ఇంతకంటే భరోసా ఏం కావాలి?
ఇప్పుడు తాజాగా అదే బెజవాడ. అదే బెంజిసెంటర్, అదే బందరు రోడ్డు. వీటి సాక్షిగా 4,097 చెత్త సేకరణ వాహనాలు కవాతు చేస్తుంటే చూసేవాళ్ళకు కనివిందు కాకుండా ఉంటుందా? ఇది మౌలిక సదుపాయాల కల్పన అనరా? ఈ 4,097 వాహనాలకు 4,097 మంది డ్రైవర్లు అంటే అన్ని కుటుంబాలకు భరోసా కాదా?
Also Read : ఆ రెండు పధకాలు.. యువత భవితకు జోడు చక్రాలు
ఇవి కాకుండా ఇంకా అదనంగా 3,097 ఆటోలు, 1771 ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ముఖ్యమంత్రి బందరు రోడ్డుపై కవాతు చేయించారు. వీటన్నిటికీ డ్రైవర్లు అంటే, మొత్తంగా 4,868 మంది డ్రైవర్లు, అన్ని కుటుంబాలకు ఉపాధి లభించలేదా!? ఇది భరోసా కాదనగలరా!?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోకపోవచ్చు. ప్రతిపక్షాలు, పచ్చమీడియా వ్యతిరేక ప్రచారం చేయొచ్చు. కానీ ఇవన్నీ చూస్తున్న ప్రజలకు తెలియదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోందో!? ఇవన్నీ చూస్తున్న ప్రపంచానికి తెలియదా సామాన్య కుటుంబాలే కేంద్రంగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతోందో!? కవాతు చేసిన ఈ వాహనాలు చెప్పవా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందో? లేదో? బెజవాడ బెంజిసర్కిల్, బందరు రోడ్డు చెప్పవా రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం జరుగుతున్నాయో? లేదో?
పక్షపాతంతోనో, పచ్చకామెర్లతోనో చూస్తే తప్ప గడచిన రెండున్నరేళ్ళుగా ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరుగుతోందని స్పష్టంగా అర్ధమవుతుంది. ఏదో ఓ పారిశ్రామికవేత్త కుటుంబం లబ్దిపొందడం కంటే ఇలా కొన్ని వేల కుటుంబాలు లబ్దిపొందే అభివృద్ధినే ఏ సామాజికవేత్త, ఏ ఆర్థికవేత్త అయినా కోరుకునేది. ఆ అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండున్నరేళ్ళుగా జరుగుతోంది. చూసే కళ్ళకు అది కనిపిస్తుంది.
Also Read : చిరు వ్యాపారులకు తప్పిన డైలీ ఫైనాన్స్ కష్టాలు