iDreamPost
android-app
ios-app

ఆ పావురం ఖరీదు కేవలం 14 కోట్లు మాత్రమే..

ఆ పావురం ఖరీదు కేవలం 14 కోట్లు మాత్రమే..

అది ఒక రేసింగ్ పావురం.. దాని పేరు ‘న్యూ కిమ్‌’.. 2018లో జరిగిన ఏస్ పీజియన్ గ్రాండ్ నేషనల్ మిడిల్ డిస్టెన్స్ పోటీల్లో విజేతగా కూడా నిలిచింది.

రెండేళ్ల వయసున్న ఈ న్యూ కిమ్ పావురాన్ని బెల్జియంలోని పిపా అనే సంస్థ వేలం వేసింది. కేవలం 200 యూరోల బేస్ ప్రైస్‌ తో వేలానికి పెట్టగా మెల్లగా వేలం కాస్త కోట్ల రూపాయల్లోకి మారిపోయింది. అలా 1.6 మిలియన్ యూరోలకు న్యూ కిమ్ పావురం అమ్ముడుపోయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.14.11 కోట్లు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా భారీ ధరకు అమ్ముడైన పావురంగా న్యూ కిమ్ రికార్డు సృష్టించింది.

పిపా చైర్మన్ నికోలస్ గైసెల్బ్రెచ్ట్ మాట్లాడుతూ నిజానికి ఈ పావురం అంత ధర పలుకుతుందని అస్సలు అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చైనాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి “న్యూ కిమ్”ను 14.11 కోట్లకు వేలంలో సొంతం చేసుకున్నాడు.

కాగా గత సంవత్సరం మార్చి 17న ఆర్మెండో అనే మగ పావురం వేలంలో 10 కోట్లకు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించగా తాజాగా 14.11 కోట్లకు అమ్ముడుపోయింది న్యూ కిమ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది..