iDreamPost
android-app
ios-app

మధ్యం మత్తులో బైక్ ను ఢీ కోట్టిన తెలుగుదేశం మాజీ మంత్రి కుమారుడు.

  • Published Dec 15, 2019 | 5:23 AM Updated Updated Dec 15, 2019 | 5:23 AM
మధ్యం మత్తులో బైక్ ను ఢీ కోట్టిన తెలుగుదేశం మాజీ మంత్రి కుమారుడు.

విశాఖ బీచ్ రోడ్డులో తెలుగుదేశం మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడుపుతు డివైడర్ పై నుండి దూసుకు వెళ్ళి టూవీలర్ ను ఢీకొట్టాడు. దీంతో టూవీలర్ మీద ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి, ఆ సమయంలో కారు వేగం 120 పైనే ఉంటుందని, కారులో అప్పలనాయుడుతో పాటు మరో ముగ్గురు అతని స్నేహితులు ఉన్నారని చూసినవారు చెప్తున్నారు. సాదారణంగా బీచ్ రోడ్ అంటేనే వాకర్స్ తో రద్దిగా ఉంటుంది, కాని తెల్లవారుజామున 2గంటల సమయం కావటంతో ఆ సమయంలో వాకర్స్ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది.

సఘంటన జరిగిన వేంటనే అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర గాయాలపాలైన యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి అప్పలనాయుడిని పట్టుకుని దేహశుద్ది చేసినట్టు తెలుస్తుంది, పొలీసులు వచ్చే సమయానికి అతడు అక్కడ నుండి పారారీ అయ్యాడు. కారులో రిటైర్డ్ డి.ఐ.జి కుమారుడు, మరో ఇద్దరు ఉండగా వారిలో మౌర్య ,ప్రవీణ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అప్పలనాయుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.